twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్ కు, KBC నిర్మాతకు కోర్టు నోటీసులు

    By Srikanya
    |

    ముంబై : టీవీ క్విజ్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌తోపాటు కేబీసీ నిర్మాత సిద్ధార్థ్ బసుకు స్థానిక కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో వస్తున్న కేబీసీ ప్రోమోలు న్యాయవాదులు, న్యాయవాద వృత్తిని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ దేవిందర్‌సింగ్ రక్కడ్ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ కోర్టు ఈ నోటీసులిచ్చింది. కేసు విచారణ జరిగే ఈ నెల 21లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

    అమితాబ్‌ బచ్చన్‌ స్టార్‌ప్లస్‌లో నిర్వ హించిన 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' ఎంతో మందిని నిజంగా కోటీశ్వరులని చేయడమే కాక కోట్లాది ప్రేక్షక ప్రజానీ కాన్ని కూడా విశేషంగా ఆకర్షించింది. స్టార్‌ప్లస్‌, సినర్జీ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ టీవీషోలు సిద్ధార్థ్‌ బసు నిర్మించారు. అమితాబ్‌ బచ్చన్‌ నేతృత్వం లో ఇవి అత్యంత జన మనోరంజకంగా వర్ధిల్లాయి. ఆ తర్వాత కారణాంతరాల వల్ల అమితాబ్‌బచ్చన్‌ ఈ షోల నుంచి విరమించు కోవడం, బాలీవుడ్‌ కింగ్‌ షారూఖ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో కొంతకాలం పాటు ఈ షోలు కొనసాగినా, అవి అంతగా జనాన్ని ఆకర్షించలేకపోవడం అందరికీ తెలిసిన విషయమే.

    Amitabh Bachchan

    ఇక ఏడాది కిందట ప్రసారమైన కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పవిత్ర ఖురాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌పై దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. సెప్టెంబరు 28, 2011న ప్రసారమైన కార్యక్రమంలో అమితాబ్‌.. 'రచా గయా' అనే పదాన్ని వాడారంటూ ఝాన్సీ నివాసి ముదస్సిర్‌ ఉల్లా ఖాన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

    ఖురాన్‌ను ఎవరూ రచించలేదని, అది ఎవరీ సృష్టి కాదని.. అల్లా నుంచి ఉద్భవించిన పవిత్ర గ్రంథమని ఖాన్‌ న్యాయస్థానానికి నివేదించారు. ఆయన వాదనను తోసిపుచ్చిన జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా.. పిటిషన్‌ను కొట్టివేశారు. అమితాబ్‌ బచ్చన్‌ స్టార్‌ప్లస్‌లో నిర్వ హించిన 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' ఎంతో మందిని నిజంగా కోటీశ్వరులని చేయడమే కాక కోట్లాది ప్రేక్షక ప్రజానీ కాన్ని కూడా విశేషంగా ఆకర్షించింది.

    ఇక అమితాబ్ ఈసారి ఆయన కొత్త అవతారం ఎత్తనున్నారు. డైలీ సీరియల్‌లో ఒక ప్రధానపాత్ర పోషించబోతున్నారు. కౌన్‌ బనేగా కరోడ్‌పతి ఆరవ సీజన్‌ షూటింగ్‌నుఇటీవలే ముగించిన అమితాబ్‌ ఈ ఏడాదే ప్రసారం కాబోతున్న ఒక హిందీ సీరియల్‌లో నటించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని బయటకు తెలపకుండా దాస్తున్నప్పటికీ, ఈ సీరియల్‌ను అమితాబ్‌ సొంత సంస్థ ఏబీసీఎల్‌ నిర్మిస్తున్నట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. ఈ సీరియల్‌కోసం ప్రస్తుతం ముంబాయి అంధేరిలోని పలు స్టూడియోలలో నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది. భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. దీనిలో ప్రధాన ఆకర్షణ అమితాబ్‌ అయినప్పటికీ, ఆయన ప్రతి ఎపిసోడ్‌లో కనిపించరని చెబుతున్నారు. అయితే ఆయన దీనికి ప్రచారంమాత్రం ముమ్మరంగా రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది.

    English summary
    A local magistrate's court issued notices to the producer of TV quiz show Kaun Banega Crorepati (KBC) and Amitabh Bachchan, host of its Season-7, among others after a complaint alleged that its promos present the legal profession in a "derogatory" manner. Chief Metropolitan Magistrate S V Parekh asked all seven respondents, in an application filed by advocate Davinder Singh Rakkad, to file their response by August 21 when he would hear the case again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X