»   »  నాగ్ అదిరిపోయే స్ట్రాటజీ : అఖిల్ ని గెస్ట్ గా

నాగ్ అదిరిపోయే స్ట్రాటజీ : అఖిల్ ని గెస్ట్ గా

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు షో' మూడో సీజన్ ఎనౌన్సమెంట్ రీసెంట్ గా మాటీవి నుంచి వచ్చింది. అక్టోబర్ లో ఈ మూడో సీజన్ స్టార్టవుతుంది. ప్రస్తుతం సెలక్షన్స్ ప్రక్రియ నడుస్తోంది. ఈ షో లో ప్రధాన ఆకర్షణ..హాట్ సీట్లో కూర్చునే సెలబ్రెటీలు. తమ తాజా సినిమాలు ప్రమోట్ చేసుకోవటానికి ఈ పోగ్రామ్ ని సెలబ్రెటీలు ఉత్సాహంగా ఎంచుకుంటూంటారు.

Akhil Coming Soon On Meelo Evaru Koteeswarudu

అదే కోవలో అఖిల్ తన లాంచింగ్ చిత్రం అఖిల్ ని ప్రమోట్ చేసుకోవటానికి ఈ షోలో పాల్గొననున్నారని సమాచారం. ప్రారంభ ఎపిసోడ్ కి అఖిల్ గెస్ట్ గా వస్తాడనే ప్రచారం జరుగుతోంది. తన చిన్న కొడుకుతో ఈ షోని ప్రారంభించటం కలిసి వస్తుందని భావిస్తున్నాడు. దానికి తోడు అఖిల్ ఇప్పుడు మార్కెట్లో హాట్ ప్రాపర్టీ. అది కూడా టీఆర్పీలకు ఓ రేంజిలో ఉపయోగపడుతుంది.

Akhil Coming Soon On Meelo Evaru Koteeswarudu

ఇక ఇప్పటికే ఈ పోగ్రాం గురించి ప్రమోషన్ ప్రారంభమైంది. దాని వివరాలు ఈ క్రింద వీడియోలో చూడండి.

For All Official Updates Of Meelo Evaru Koteeswarudu - Official Season 3 .. Like https://www.facebook.com/mekofficial

Posted by Meelo Evaru Koteeswarudu - Official on 25 September 2015

నాగార్జున మాట్లాడుతూ... " నేను 60 ఎపిసోడ్లు ఎక్సపెక్ట్ చేస్తున్నాను . డేట్స్ కూడా ఖరారు అయినట్లే ," అని అన్నారు. ఇందుకోసం ఆయన తాను చేస్తున్న సినిమాలు కూడా పూర్తి చేసుకుని ఖాళీ చేసుకుంటున్నారు.

మరో వీడియో ఇక్కడ....

#MeeloEvaruKoteeswarudu - Season 3 - Call For Entries from Tomorrow (Sep 26th) .. #1DayToGo

Posted by Meelo Evaru Koteeswarudu - Official on 24 September 2015

చిన్న తెరపై సంచలనాలు సృష్టిస్తూ.. వీక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న కార్యక్రమం 'మీలో ఎవరు కోటీశ్వరుడు . మొదటి,రెండు సీజన్లు అందించిన ఉత్సాహంతో కనాగార్జున మూడవ సీజన్ మొదలుపెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ సారి కూడా గతంలో లాగానే స్టార్ ఇమేజ్ కు పెద్ద పీట వేయనున్నారని సమాచారం. అక్టోబర్ నుంచి ఈ షో షూటింగ్ మొదలవుతుంది.
Akhil Coming Soon On Meelo Evaru Koteeswarudu

నాగార్జున కంటిన్యూ చేస్తూ..."ఈ షో నాకు ప్రజల మనస్సులని స్పృశించే అవకాసం కల్పిస్తోంది. నటులుగా మేము కేవలం ఎంటర్టైన్ చేస్తూంటాం...అయితే ఈ షోతో చాలా మంది జీవితాల్లో వెలుగు తెచ్చి వారి ముఖాల్లో నిజమైన ఆనందం కలగ చేసే అవకాసం కలుగచేస్తోంది. ఈ షో ద్వారా నాకు కలుగుతున్న ఆనందాన్ని నేను మాటల్లో వ్యక్తం చేయలేను ," అన్నారు.

English summary
Akkineni Akhil will reportedly be a surprise guest soon on Meelo Evaru Koteeswarudu,
Please Wait while comments are loading...