twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శాటిలైట్ రేటు 5 కోట్లా...నిజమే?

    By Srikanya
    |

    హైదరాబాద్ : పెద్ద సినిమాకైనా, చిన్న సినిమాకైనా శాటిలైట్ రైట్స్ అనేవి ఈ రోజుల్లో కీలకంగా మారుతున్నాయి. అయితే చిత్రంలో స్టార్ కాస్టింగ్ ని బట్టి,డైరక్టర్ ని బట్టి శాటిలైట్ రైట్స్ రేటు నిర్ణయం చేస్తూంటారు. తాజాగా వినాయిక్ చిత్రం 'అల్లుడు శ్రీను' కి ఐదు కోట్లు శాటిలైట్ రేటు వచ్చినట్లు ట్రేట్ వర్గాల్లో వినిపిస్తోంది. జెమెనీవారు ఈ రైట్స్ ని తీసుకున్నట్లు చెప్తున్నారు. వినాయిక్ ని నమ్మి ఈ రేటు వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఇది ఇంత రేటు కొత్త హీరోకు ఎలా వస్తుంది...ఎంత వినాయిక్ అయితే మాత్రం అని కొందరు సినిమావాళ్లు అంటున్నారు.

    ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్‌ రూపొందిస్తున్న చిత్రం టైటిల్ 'అల్లుడు శ్రీను'. ఆ చిత్రంలో హీరో నిర్మాత కొడుకు శ్రీనివాస్. ఈ కుటుంబకథా చిత్రంలో సమంత హీరోయిన్‌ నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలకు ధీటుగా హీరో శ్రీనివాస్‌ స్టెప్‌లు వేశాడని యూనిట్‌ చెబుతోంది. ఈ చిత్రం చాలా బాగా వస్తోందని, ట్రైలర్ విడుదల అయ్యాక..అంతా వినాయిక్ ప్రతిభ గురించే మాట్లాడుకుంటారని చెప్పుకుంటున్నారు.

    Alludu Seenu satellite rights sold

    బ్రహ్మానందం, శ్రీనివాస్ మధ్యలో వచ్చే అనేక సన్నివేశాల నేపథ్యంలో ఈ టైటిల్ అనేకసార్లు వినిపిస్తుండడంవల్ల ఈ చిత్రానికి ఇదే సరైన పేరని నిర్ణయించుకున్నామని తెలిపారు. సినిమా మొదటినుండి చాలా సరదా సరదాగా సాగుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా విందు భోజనం అందిస్తుందని, ఈ చిత్రంలో తమన్నా చేసిన పాట హైలెట్‌గా ఉండనుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని, ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులు ఆనందించేలా ఉంటుందని, కొత్త హీరో అయినా కానీ సినిమా అగ్ర స్థాయి హీరో చిత్రంలా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.

    ఈ నెల 29న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను విడుదల చేయనున్నామని, ఏడు సంవత్సరాలుగా కథానాయకుడు శ్రీనివాస్ అన్ని రకాల శిక్షణలు తీసుకుని ఓ మంచి దర్శకుడు దగ్గర ఈ చిత్రాన్ని చేస్తుండడం సంతోషంగా ఉందని, ఓ రకంగా అతని అదృష్టంగా తాను భావిస్తున్నానని నిర్మాత బెల్లకొండ సురేష్ తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.

    ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెనె్నల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:కోన వెంకట్, రచన:గోపిమోహన్, కథ:కె.ఎస్.రవీంద్రనాధ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, కెమెరా:్ఛటా కె.నాయుడు, సమర్పణ:బెల్లకొండ సురేష్, నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి.వి.వినాయక్.

    English summary
    Bellamkonda Sai Srinivas' debut film ‘Alludu Seenu's satellite rights are bagged by Gemini TV for Rs.5crs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X