twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ షో తలనొప్పి అమితాబ్‌ కి తీరిపోయింది

    By Srikanya
    |

    Amitabh Bachan
    అలహాబాద్‌: ఏడాది కిందట ప్రసారమైన కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పవిత్ర ఖురాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌పై దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. సెప్టెంబరు 28, 2011న ప్రసారమైన కార్యక్రమంలో అమితాబ్‌.. 'రచా గయా' అనే పదాన్ని వాడారంటూ ఝాన్సీ నివాసి ముదస్సిర్‌ ఉల్లా ఖాన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

    ఖురాన్‌ను ఎవరూ రచించలేదని, అది ఎవరీ సృష్టి కాదని.. అల్లా నుంచి ఉద్భవించిన పవిత్ర గ్రంథమని ఖాన్‌ న్యాయస్థానానికి నివేదించారు. ఆయన వాదనను తోసిపుచ్చిన జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా.. సోమవారం పిటిషన్‌ను కొట్టివేశారు. అమితాబ్‌ బచ్చన్‌ స్టార్‌ప్లస్‌లో నిర్వ హించిన 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' ఎంతో మందిని నిజంగా కోటీశ్వరులని చేయడమే కాక కోట్లాది ప్రేక్షక ప్రజానీ కాన్ని కూడా విశేషంగా ఆకర్షించింది.

    స్టార్‌ప్లస్‌, సినర్జీ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ టీవీషోలు సిద్ధార్థ్‌ బసు నిర్మించారు. అమితాబ్‌ బచ్చన్‌ నేతృత్వం లో ఇవి అత్యంత జన మనోరంజకంగా వర్ధిల్లాయి. ఆ తర్వాత కారణాంతరాల వల్ల అమితాబ్‌బచ్చన్‌ ఈ షోల నుంచి విరమించు కోవడం, బాలీవుడ్‌ కింగ్‌ షారూఖ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో కొంతకాలం పాటు ఈ షోలు కొనసాగినా, అవి అంతగా జనాన్ని ఆకర్షించలేకపోవడం అందరికీ తెలిసిన విషయమే.

    English summary
    The Allahabad High Court has dismissed a petition against Bollywood star Amitabh Bachan for having made derogatory remarks against Holy Quran during the famous show Kaun Banega Crorepati. The case was filed by Jhansi a resident of Mudassir Ullah Khan a year back in the high court. In her case she said Holy Quran was neither written nor created by anybody rather it came into existence by god himself and use of the phrase Racha Gaya was a serious offence as Big-B is a popular person and words would affects all the communities however Justice misra did not agree with the contention that to say racha gaya will not imply to Quran which was written by some person.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X