»   »  ఈటీవి నుంచి 4 తెలుగు కొత్త ఛానెల్స్...రేపటినుంచే

ఈటీవి నుంచి 4 తెలుగు కొత్త ఛానెల్స్...రేపటినుంచే

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈటీవి నుంచి మరో నాలుగు కొత్త ఛానెల్స్ వచ్చి తెలుగు వారిని అలరించనున్నాయి. రేపటి నుంచే ఈ ఛానెల్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే న్యూస్ కు ఒకటి, ఎంటర్టన్మెంట్ కు ఒక ఛానెల్ ఉన్నాయి.

ETV PLUS   launching from tomorrow

ఇప్పుడు కొత్తగా కామెడీ కోసం ఈటీవి ప్లస్, ఆరోగ్యం కోసం ఈటీవి లైఫ్, సినిమాల కోసం ఈటీవి సినిమా, వంటల కోసం ఈటీవి అబిరుచి ఛానెల్స్ మొదలవుతున్నాయి.

తమ ఛానెల్స్ లో కొన్నిటిని వయాకామ్ కు ఇచ్చేసాక, ఇప్పుడు రామోజీ గ్రూప్ ఈ విధంగా కొత్త ఛానెల్స్ తో విస్తరిస్తోంది. ఈటీవి ప్లస్ లో ఎక్కువగా సినిమాలకు సంభందించిన కంటెంట్, కామెడీ, రియాలటీ షోలు ఉంటాయని సమాచారం.

ETV PLUS   launching from tomorrow

అళాగే ఈటీ సినిమాల కోసం చాలా సినిమాలు ఇప్పటికే కొన్నారని చెప్తున్నారు. మా, జెమెనీ, జీ తెలుగు ఛానెల్ లాగానే ఈటీవి కూడా పెద్ద స్టార్స్ సినిమాలను ఇక నుంచి ప్రసారం చేయనుందని సమాచారం. అందుకోసం పెద్ద హీరోలు సిని మాల కొనుగోలుకు ఉత్సాహం చూపుతోంది.

English summary
Telugu Entertainment Channel ETV PLUS launching from tomorrow.
Please Wait while comments are loading...