twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈటీవీ తెలుగు మంచి ప్లానే వేసింది

    By Srikanya
    |

    హైదరాబాద్: ఈటీవీ కొత్త ట్రెండ్ కు తెర లేపింది అంటున్నారు. వారు రెండు వారాల క్రితం విడుదలైన ప్రభంజనం చిత్రాన్ని ఈటీవీలో ఆదివారం ప్రసారం చేసారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ లేకుండానే ఈ చిత్రం ప్రసారం చేసిందని తెలుస్తోంది. నిర్మాతతో చేసుకున్న డీల్ వల్ల ఈ స్క్రీనింగ్ జరిగింది. ఈ చిత్రం ప్రసారం సమయంలో వచ్చే లాభాల్లో 50% చొప్పున పంచుకునేటట్లు ఎగ్రిమెంట్ చేసుకుని ప్రసారం చేసినట్లు తెలుస్తోంది.

    రెవిన్యూ షేరింగ్ బేసిస్ లో ఇలా కొత్త సినిమాలను ప్రసారం చేయటం అటు నిర్మాతకు, ఇటు ఛానెల్ కు కలిసి వచ్చే అంశం అంటున్నారు. దాని వల్ల మంచి రేటింగ్, షేర్ వస్తే అదే సినిమాని నిర్మాత మరో ఛానెల్ లో ప్రసారం చేసుకునే అవకాసం ఉంది. అదే శాటిలైట్ రైట్స్ అమ్మితే ఆ ఛానెల్ వాళ్ళు మాత్రమే ప్రసారం చేయగలుగుతారు. ఇప్పుడు ఆ సినిమాలో ఉన్న విషయం, దమ్ముని బట్టి ఎన్ని సార్లైనా, ఇష్టం వచ్చిన ఛానెల్ లో ప్రసారం చేసుకోవచ్చు.

    ETV sets new trend in film telecasting

    ఛానెల్ వైపు నుంచి చూస్తే...ఈ విధానంలో ఒకేసారి పెద్ద మొత్తం పెట్టి కొనుక్కుని, ఆ సినిమాకి యాడ్ రెవిన్యూ వస్తుందా లేదా అన్నది చూడాల్సిన పనిలేదు. నిజంగా సినిమాలో విషయం ఉంటే ఛానెల్, నిర్మాత ఇద్దరూ లాభపడతారు. చిన్న సినిమాలకు ఇది లాభించే స్ట్రాటజీ అంటున్నారు. అయితే రిలీజైన వారం, లేదా రెండు వారాల లోపే ఛానెల్స్ లో ప్రసారం చేస్తేనే ఫలితం ఉంటుంది. అప్పటివరకూ చేస్తున్న పబ్లిసిటీ సైతం తమ ఛానెల్ ప్రసార సమయంలో కలిసి వస్తుంది అంటున్నారు.

    ఇదే విధానాన్ని భవిష్యత్ లో మిగతా ఛానెల్స్ కూడా అవలంబించే దిసగా ఆలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విధానం వల్ల ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఛానెల్ కు ఉండదు. అయితే హిట్టైన సినిమాలు ఇలా ఒప్పుకుంటాయా లేదా అన్నది చూడాలి. వారు కూడా థియోటర్ లో విడుదల చేసినట్లు, ఛానెల్ లో విడుదల చేసి రెవిన్యూ కోసం ఎదురుచూస్తారు. ఛానెల్ లోనూ హిట్టైందా శాటిలైట్ రైట్స్ కన్నా ఎక్కువే వస్తాయి.

    English summary
    ETV is setting a new trend by screening Prabhanjam in its channel. They got into a deal with the producer according to which it will share 50% of the profits gained from the screening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X