twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కౌన్‌ బనేగా కరోడ్‌పతి': రూ.కోటి గెలుచుకున్న యువతి

    By Srikanya
    |

    ముంబయి: అత్యంత ప్రజాదరణ పొందిన 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' (కేబీసీ) టీవీ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఒక యువతి 'కరోడ్‌పతి' అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన 22ఏళ్ల ఫిరోజ్‌ ఫత్మా ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కోటి రూపాయలు గెలుచుకుంది. ఇప్పటికే ఆరు 'కేబీసీ'లు పూర్తయ్యాయి. ఏడో కార్యక్రమంలో ఫిరోజ్‌ పత్మా విజేతగా నిలిచారు.

    ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌బచ్చన్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిరోజ్‌ ఫత్మా బీఎస్సీ చదివింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సోదరి చదువు ఆగిపోకూడదని, ఫత్మా పై చదువులకు వెళ్లకుండా ఆగిపోయింది. కేవలం వార్తాపత్రికలు చదివి, న్యూస్‌ఛానెళ్లు చూసి మాత్రమే తాను విజ్ఞానాన్ని సముపార్జించానని ఫత్మా చెబుతోంది.

    Firoz Fatma Is Kaun Banega Crorepati 7's First Female Crorepati!

    కేబీసీలో చెప్పుకోదగ్గ మొత్తం గెలుచుకుంటే మరణించిన తన తండ్రి చేసిన అప్పలు తీర్చవచ్చని ఫత్మా అనుకుంది. అనూహ్యంగా రూ.కోటిని చేజిక్కించుకుంది. ఇప్పుడు తాను ఉన్నత చదువులు చదువుతానని, తన తల్లికి ఆందోళనలేని జీవితాన్ని అందిస్తానని చెబుతోంది. ఈ షో సోనీ టీవీలో డిసెంబర్‌ 1న ప్రసారమవుతుంది.

    బాలీవుడ్ రారాజు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంతో ఇష్టపడి చేసిన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి. ఈ రియాల్టీ షో వల్ల అమితాబ్ తిరిగి కోల్పోయిన పూర్వవైభవం మరలా తిరిగిపోందారు. అంతేకాకుండా తనకంటూమరలా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగానే గాక ప్రపంచంలోని బిగ్ బి అభిమానులు "కోటి" కళ్లతో చూస్తున్నసంగతి అందరికి తెలిసిందే.

    English summary
    
 Kaun Banega Crorepati season 7 gets its first female crorepati Firoz Fatma. She is 22 years old and belongs to Saharanpur UP. Firoz became the first woman to have won Rs one crore in the seventh season of the game show hosted by the living legend Amitabh Bachchan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X