twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అమృతం ' సీరియల్ ..కామిక్ బుక్ గా

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఇతర దేశాల్లోతో పోలిస్తే మన దేశంలో కామిక్ బుక్స్ కు స్దానం తక్కువనే చెప్పాలి. పురాణాలు, జానపద కథలను బేస్ చేసుకున్న అమర్ చిత్ర కథ వంటి కామిక్ బుక్స్ తప్ప మన సినిమాలను, టీవి సీరియల్స్ ని బేస్ చేసుకున్న కామిక్స్ అసలు లేవనే చెప్పాలి. ఆ లోటు తీర్చటానికా అన్నట్లు గుణ్ణం గంగరాజు తమ సూపర్ హిట్ అమృతం ని కామిక్ బుక్ గా తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఆ లింక్ .. http://amruthamthemovie.com/book/Amrutham_Comic_Book1/imgpages/image000.html

    ఇక వైవిధ్య భరిత చిత్రాల చిరునామా గుణ్ణం గంగరాజు తమ జస్ట్ ఎల్లో మీడియా ప్రై. లిమిటెడ్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'అమృతం చందమామలో'.అవసరాల శ్రీనివాస్, హరీష్ కోయలగుండ్ల, వాసు ఇంటూరి, శివన్నారాయణ, ధన్య, సుచిత్ర కీలక పాత్రధారులు గా కనిపించే ఈ చిత్రం మే 17 న గ్రాండ్ గా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మన దేశంలో మొదటి స్పేస్ మూవీగా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచానేలే ఉన్నాయి. ఈ చిత్రం టైటిల్ విన్నప్పుడు నుంచీ సినిమా కథేమిటి, ఈ సారి గుణ్ణం గంగరాజు ఏ విధమైన నవ్వులు సిద్దం చేసారు అనే ఆలోచన అందరిలో మెదిలింది. అదే ఓపినింగ్స్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.

    ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ... ''ఇతర దేశాల్లో వ్యాపారం పెట్టాలని చాలామంది కోరుకుంటారు. కానీ మా సినిమాలోని ప్రధాన పాత్రలు దానికి భిన్నంగా ఆలోచిస్తాయి. అసలు ఈ భూమి మీదే కాకుండా చందమామ మీద వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేస్తారు. దానికి రూపమే ఈ సినిమా. చంద్రమండలంపై నడిచే కథ ఇది. అక్కడ ఓ హోటల్‌ పెట్టాలనుకొని బయల్దేరిన ఓ బృందానికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నదే చిత్రం.'' అని చెప్పారు.

    అలాగే... ''బుల్లితెరపై విజయవంతమైన ధారావాహిక.. అమృతం. దానికి కొనసాగింపుగా మరొకటి ఎందుకు తీయకూడదు అని చాలా మంది అడిగారు. అప్పుడే 'అమృతం... చందమామలో' ఆలోచన వచ్చింది. ఇవే పాత్రల్ని వెండితెరపైకి తీసుకెళితే పరిధి పెరుగుతుంది కదా అని కథ రాయడం మొదలుపెట్టా. ఇందులో 60 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటాయి. కామెడీ మాత్రం చవకగా ఎందుకుండాలి? అందుకే భారీగా సెట్స్‌వేసి చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది'' అన్నారు.

    Gunnam Ganga Raju's Amrutham as comic book

    ఇక "అమృతం సీరియల్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఆరేళ్లపాటు వారానికి ఒకసారి నిర్విరామంగా ఆ సీరియల్‌ను ప్రసారం చేశాం. ఇప్పుడు రీ టెలికాస్ట్ అవుతోంది. అంటే దాదాపు 12 ఏళ్లుగా ఆ సీరియల్‌ను చూస్త్తూనే ఉన్నారు. 300 ఎపిసోడ్లకు పైగానే చేశాం. అంతకన్నా ఏం చేస్తామనుకుని ఆపేశాం. 'అమృతం'ను ఎక్కడైతే ఆపామో, అక్కడే 'అమృతం చందమామలో' సినిమాను మొదలుపెట్టాం. ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. చమత్కారాలుంటాయి. ఆరు నెలలు కథ కోసం కసరత్తులు చేశాం.

    ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు రసూల్ హీరో అయితే, గ్రాఫిక్స్ హీరోయిన్ అవుతాయి. చాలా ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఈ తరహా సినిమాల్లో ఇది గొప్పగా ఉండాలని తెరకెక్కించాం. స్టార్టింగ్ టైటిల్స్ నుంచి ఎండింగ్ టైటిల్స్ వరకు అన్నీ ఈ సినిమాలో హైలైట్లే. చాలా రిస్క్ చేసి ఈ ప్రాజెక్ట్‌ను చేశాం. ఈ సినిమాకు సీక్వెల్స్ చేసే ఆలోచనల్లోనూ ఉన్నాం. 'అమృతం కంచుకోటలో' అనే కథ మైండ్‌లో ఉంది. ఈ నెల్లోనే 'అమృతం చందమామలో'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

    చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్, రావు రమేష్, అశోక్ కుమార్ ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: గంగరాజు గుణ్ణం, వాసు ఇంటూరి, పాటలు: అనంతశ్రీరామ్, నృత్యాలు: విజయ్, ఫైట్స్: కింగ్ సాలమన్, ఆర్ట్: జె.కె.మూర్తి, సంగీతం: శ్రీ, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, కెమెరా: రసూల్ ఎల్లోర్, గ్రాఫిక్స్: ఈసీఎస్, లాఫింగ్ డాట్స్, నిర్మాత: ఊర్మిళ గుణ్ణం.

    English summary
    It is raining fun from the Amrutham team and this time it is the comic book fans who are going to be taken by surprise. The Amrutham comic book is coming out soon. Keep watching this space for more!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X