»   » లైవ్‌లో షకీలా...ని పెట్టి సెక్స్ 'షో' బిజినెస్: ఫోర్న్ బెస్ట్... ఇంత దిగజారుడా...

లైవ్‌లో షకీలా...ని పెట్టి సెక్స్ 'షో' బిజినెస్: ఫోర్న్ బెస్ట్... ఇంత దిగజారుడా...

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టీఆర్పీల కోసం టీవీ ఛానెల్స్ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కేవలం రెగ్యులర్ ,రొటీన్ వార్తలు,వాతావరణ విశేషాలతో రేటింగ్స్ రావు. ఏదో ఒక సంచలనం ఉండాలి...ఎప్పుడూ ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ ఉండాలి. అది ప్రతీసారి జరిగే పని కాదు.

ఏ సెన్షేషన్ లేనప్పుడు మనమే దాన్ని క్రియేట్ చేయాలి అని నమ్ముతూంటారు టీవి ఛానెల్స్ లో పనిచేసే క్రియేటివ్ హెడ్స్. దాంతో వాళ్ళు రకరకాల ప్లాన్స్ వేస్తూంటారు. ఒక్కోసారి టీఆర్పీల కోసం దిగజారి అందరిచేతా తిట్లు కూడా తింటూంటారు. ఇప్పుడు అదే పరిస్దితి కొన్ని టీవి ఛానెల్స్ కు ఏర్పడుతోంది. వారు అతి తెలివితో చేస్తున్న పోగ్రామ్ లకు విమర్శలకు గురి అవుతున్నాయి.

జనాలు చూస్తున్నారు కాబట్టి ..వేస్తున్నాం అనే కాన్సెప్టుతో నడపబడుతున్న ఈ పోగ్రామ్ లకు వ్యూయర్ షిప్ బాగుంటోంది. ఓ ఛానెల్ ఉత్సాహంగా మొదలెట్టిన ఈ మసాలా పోగ్రామ్ మిగతా ఛానెల్స్ కు వైరల్ లాగ పాకింది.

ఇప్పుడు మిగతా ఛానెల్స్ వాళ్లు కూడా ఇలాంటి పోగ్రామ్ లు వేయకపోతే మనుగడ కష్టం అని భావించే స్దితికి చేరారు. ఇంతకీ ఆ పోగ్రామ్ లు ఏమిటి..తమిళనాట భారీ చర్చకు దారి తీసి,త్వరలో తెలుగు టీవి ఛానెల్స్ కు పాకపోతున్న ఓ మిడ్ నైట్ మసాలా పోగ్రామ్ పై ప్రత్యేక కథనం.

ఫోర్నోగ్రఫిని మించిన

ఫోర్నోగ్రఫిని ఇండియాలో క్రైమ్ గా పరిగిస్తారు. అయితే మీరు ఎప్పుడైనా మోరలిస్టిక్ పోర్నేగ్రఫీ గురించి విన్నారా. ఇప్పుడు కొన్ని తమిళ ఛానెల్స్ ఈ కొత్త ధీరిని కనుక్కున్నారు. తమ టీఆర్పీల కోసం. నీతి ముసుగులో సెక్స్ పోగ్రామ్ లు అందిస్తున్నాయి.

ఈ పోగ్రామ్స్ లో జరుగుతున్నది ఇదే

ఈ సెక్సాలజీ పోగ్రామ్స్ ని నడిపే యాంకర్స్ చాలా హాట్ గా ఉండేటట్లు చూస్తున్నారు. ఈ పోగ్రామ్ లో ఫొటోలే మీరు ఇక్కడ చూస్తున్నవి. వీటిలో డా.పళిని అనే సిద్ద డాక్టర్ కనపడి, జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూంటారు. అవన్నీ సెక్స్ రిలేటెడ్ గా ప్రవోక్ చేసేటట్లే ఉంటాయి.

సెక్స్ సమస్యలకు..

ఇక ఈ పోగ్రామ్స్ లో మరో అంశం ఏమిటి అంటే..జనాలు సెక్స్ సమస్యలకు, ఈ డాక్టర్ సలహాలు ఇస్తూంటారు. పోనీ ఈ డాక్టర్ మన సమరం గారిలా ఆ కోర్స్ చేసి, నైపుణ్యం సాధించినవాడా అంటే కాదు.

ఈ పోగ్రాం పేరేంటంటే

ఇక ఈ పోగ్రామ్ పేరు అంతర్జానం అని పెట్టారు ఓ ఛానెల్ వారు. మరి ఏ జ్ఞానం ఇందులో జనాలుకు అందచేస్తున్నారో కానీ తెగ చూస్తున్నారు ఎగబడి. ఆ పోగ్రామ్ లకు ఎడిక్ట్ అవుతున్నారని కంప్లైంట్స్ సైతం వస్తూండటం గమనార్హం.

ఈవిడని సీన్ లోకి తెచ్చారు

ఒకప్పుడు తన సెక్సీ అందాలతో , మళయాళ చిత్ర పరిశ్రమనే కాక ,దక్షిణాది భాషలన్నిటినీ ఊపిన కామేశ్వరి షకీలా ఈ పోగ్రామ్ లో యాంకర్ గా కనిపించి, పలకరిస్తూంటుంది. ఆవిడ చెప్పే మాటలు, ఆవిడ డ్రస్...చాలా హాట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని డిజైన్ చేసారు.

హస్త ప్రయోగం మీద

ఇందులో వచ్చే ప్రశ్నలు ఓ ఉదాహరణ చూద్దాం. ఓ కాలర్...నేను వారంలో రెండు సార్లు హస్త ప్రయోగం చేసుకుంటున్నాను. అలా చేయవచ్చా..ఏమన్నా బలహీనతలు వస్తాయా అని ప్రశ్నిస్తాడు. వెంటనే ఆ ఆన్సర్ రాకుండా ఓ బ్రేక్ వస్తుంది.

డాక్టర్...ఈ ప్రశ్నకు ఏం చెప్తాడంటే

అప్పుడా డాక్టర్ గారు గంభీరంగా ఫేస్ పెట్టి..తప్పు మీరు అలా హస్తప్రయోగం చేయటం అనేది నరాల బలహీనతకు దారి తీస్తుంది. అది నపుంసకత్వానికి కూడా దారి తీయవచ్చు అని నోటి కొచ్చింది పేలుతాడు. అంతేకానీ సైంటిఫిక్ గా చెప్పడు.

ఆ విజువల్స్ కూడా ...

ఆ ప్రశ్నకు జవాబు చెప్తున్నప్పుడు ఇక వచ్చే విజువల్స్ చాలా చండాలంగా ఉంటాయి. అంతేకాకుండా ఆ డాక్టర్ ఏమి చెప్తాడంటే తాను కూడా ఒకప్పుడు అలాంటి సెక్స్ సమస్యలతో బాధపడ్డానని, మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకుని సమస్యను సాల్వ్ చేసుకున్నాని చెప్తాడు. అంటే ఇండైరక్ట్ గా తన వద్దకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోమని సలహా ఇస్తాడన్నమాట.

అప్పుడు చేస్తే తప్పుకాదట

ఇదే డాక్టర్ మరో విషయం కూడా శెలవిస్తాడండోయ్... హస్తప్రయోగం అనేది బ్రహ్మచారి గా ఉన్నప్పుడు చేసుకోవచ్చుట. అదే పెళ్లైన వారు చేస్తే మహా పాపం అంటూ మరో వివరణ ఇస్తారు. మెడికల్ సమస్యలల్లోకి ఈ మతం ప్రస్దావన ఎందుకో...మరి

వైద్య శాస్త్రప్రకారం

వాస్తవానికి హస్తప్రయోగం అనేది ప్రతీ మనిషి జీవితంలోనూ అతి నార్మల్ గా జరిగే వ్యవహారం. ఈ విషయమై చాలా సార్లు సెక్సాలజిస్ట్ లు చెప్పారు. సమరం గారు కూడా ఇదే విషయం పదే పదే చెప్తూంటారు..కంగారు పడద్దని. ఇది ఏ విధమైన బలహీనతకు దారి తీయదని పదే పదే చెప్పినా ఇలాంటి మోసకారి డాక్టర్స్ ఇలా ప్రచారం చేస్తూంటారు.

ఆ టైమ్ లో యాంకర్స్ ఎక్సప్రెషన్ చూడాలి

డాక్టర్ చెప్పిన దాన్ని మళ్లీ యాంకర్ రిపీట్ చేస్తుంది. ఆవిడ ఈ విషయాలు ప్రస్తావించేటప్పుడు ఆవిడ ఫేస్ చూడాలి. ఆ ఎక్సప్రెషన్స్ ..జీవించేస్తూంటుంది. ఇవన్నీ మనకు స్పష్టంగా అర్దమయ్యేది ఏమిటీ అంటే మేల్ వ్యూయర్ షిప్ ని భయంకరంగా పెంచుకోవటానికి చేసే ప్రయత్నం అని.

మధ్యలో ఈ బూతులేంటి

ఇక మీరు ఈ క్రింద ఇచ్చే వీడియో చూస్తే అర్దమవుతుంది...యాంకర్స్ ఎంత డర్టీ టాక్ మాట్లాడుతున్నారో. యాంకర్ ఓ మగ కాలర్ ని మీరు దసరాకు ఆయుధ పూజ చేసారా అని అడుగుతుంది. చేసాం అంటాడు. అయితే మరి మీ ఆయుధం సంగటి ఏమిటి...అంటూ బూతుల్లోకి దిగుతుంది. అప్పుడు ఇక టీఆర్పీలు రాక ఛస్తాయా.

ఆ ఛానెల్ లో ఇంకా దారణం

ఇక కెప్టెన్ టీవిలో వచ్చే ఇదే తరహా పోగ్రామ్ "Samayal Manthiram" లో అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. డాక్టర్ యాంకర్ బాడీ పార్ట్ ల మీద కూడా కామెంట్స్ చేస్తూంటాడు. ఆవిడ శరీర భాగాల మీద కామెట్స్ చేస్తూ సీన్ ని రక్తి కట్టించి, టీఆర్పీని పెంచుకుంటూండు.

ఇతర ఆడవాళ్లవి చూసి అసూయ

ఈ పోగ్రామ్ లో డాక్టర్ చెప్తూంటాడు. ఓ స్త్రీకి మరో స్త్రీనే శత్రువు. పెద్ద వక్షోజాలు కలిగిన స్త్రీ..ని చూస్తే మిగతా స్త్రీలకు అసూయ కలుగుతుందంటూ. అప్పుడు ఆ యాంకర్ తనకు అలాంటి సమస్య వచ్చిందని, తనకు పెద్ద వక్షోజాలు ఉండటంతో తాను డాక్టర్ చెప్పిన సమస్య ఎదుర్కొన్నాను అంటుంది.

వక్షోజాలు పెరగటానికి

ఈ డాక్టర్ అక్కడితో ఆగకుండా ఇలా వక్షోజాలు చిన్నగా ఉన్నవారి బాధలు తను చాలా విని ఉన్నానని, అలాంటి వారి సమస్యలు తీర్చటానికి తనదగ్గర అద్బుతమైన ఔషధి ఉందని, అంటూ ఓ వంటకం చేస్తాడు. రకరకాల దినుసులు చెప్పి, వాటితో తను చేసినట్లు చేసుకుని తింటే వక్షోజాలు పెరగటం ఖాయం అని హామీ ఇస్తాడు.

తను తినొచ్చా అని యాంకర్ గారు

ఈ డాక్టర్ గారు ఇలా ఓ వంటకం చేసి ..మీ వక్షోజాలు పెరుగుతాయని ఓ బోడి సలహా ఇవ్వగానే, వెంటనే యాంకర్ మరి నేను తినొచ్చా అంటాడు. దానికి ఆ డాక్టర్ గారు...నీకు అవసరమా..ఇప్పటికే చాలా పెద్దవి ఉన్నాయగా అన్నట్లు వెకిలిగా మాట్లాడతాడు.

ఇదిగో నమ్మక పోతే ఇక్కడ చూడండి

కెప్టెన్ టీవిలో వచ్చే ఈ పోగ్రాం లింక్ యూట్యూబ్ లో పెడితే ఎన్ని వ్యూస్ వచ్చాయో గమనించండి..దీనికి ఎంత వ్యూయర్ షిప్ ఉందో మీకు అర్దమవుతుంది.

మధ్యమద్యలో హాట్ బిట్స్

ఈ పోగ్రామ్ చేసే వాళ్లు ఇంకా బాగా ముదిరిపోయారు. ముఖ్యంగా "Thitthikkum Iravugal" పోగ్రామ్ లో అయితే సాఫ్ట్ పోర్న్ షాట్స్ వేస్తూంటారు. షకీలా నటించిన చిత్రాల బిట్స్ అన్ని కట్ చేసి ప్లే చేస్తూంటారు మధ్య మధ్యలో. ఎంత కళా తృష్ణ..మహానుభావులకు.

డాక్టర్ మాట్లాడుతుంటే షకీలాను చూడండి

ఇక ఈ పోగ్రామ్ లో డాక్టర్ గారు ఎంత సీరియస్ గా జీవిస్తున్నారో చూడండి. షకీలా సైతం ఓ విధ్యార్దినిలా వింటోంది. ఆహా ఏం నటన అనిపిస్తుంది మీకు..

ఏమన్నా ఫలితం ఉంటుందా

నిజానికి ఈ షోల వల్ల ఉపయోగం ఏమిటి..సెక్స్ ఎడ్యుకేషన్ నిజంగా ఇస్తున్నారా. జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నాం అనే ముసుగులో టీవి వాళ్లు చేస్తున్న దారుణం ఇది. తమ టీఆర్పీల కోసం...జనాలని చెడకొట్టటమే అని నిర్వర్దంగా చెప్పవచ్చు. పోనీ ఈ పోగ్రామ్ ఏ పెద్ద వాళ్లు...అన్ని తెలిసినవాళ్లు చూస్తారనుకుంటే పొరపాటే.

ఇవన్నీ ఫోర్న్ చేస్తున్నట్లుగా

ఈ పోగ్రామ్ లను తమ పిల్లలు దొంగచాటుగా చూస్తున్నారని తల్లితండ్రులు వాపోతున్నారు. టీవీలో అంటే ఆపగలం. యూ ట్యూబ్ లో వాళ్లు చూస్తూ ఎడిక్ట్ అవుతున్నారే..దీనికి పరిష్కారం లేదా అంటున్నారు. కానీ వీరి గోడు పట్టించుకునే వారు ఎవరు.

అంతర్నేత్రం అసలు జరిగేది ఇదే

అంతర్నేత్రం పేరుతో వచ్చే ఈ పోగ్రామ్ లో షకీలా డ్రస్, ఆమె ఇచ్చే టిప్స్ ఈ క్రింద చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతోందో..ఎలాంటి పోగ్రామ్ చేస్తోందో...

ఇలా చేయటం మాత్రం పద్దతి కాదు

సెక్స్ గురించి, అందుకు సంభందించిన కొన్ని సమస్యలు గురించి ఎవేర్ నెస్ తేవటం మంచిదే, దీన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ ముసుగులో ఇదిగో ఇలాంటి పోగ్రామ్ లు చేయటమే అందరికీ షాక్ ఇస్తోంది. సెక్స్ ని విచ్చలవిడిగా చూపిస్తున్నారు.

విజయమే కానీ పతనం

టీఆర్పీలు వరకూ ఈ పోగ్రామ్ ల ద్వారా సాధించవచ్చేమో కానీ...ఇది నైతిక పతనమే అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి పోగ్రామ్ లు వేసే ఛానెల్స్ పై ఓ అభిప్రాయానికి వచ్చేస్తారు. అది లాంగ్ రన్ లో దెబ్బవుతుంది అని చెప్తున్నారు. మోరల్స్ వ్యతిరేకంగా వెళ్లి,పోగ్రామ్స్ ని సక్సెస్ ని చేయటం అనేది తాత్కాలికంగా విజయమే అంటున్నారు.

మనేమం తక్కువ కాదు

అప్పట్లో మాటీవిలాంటి ఛానెల్స్ సైతం మిడ్ నైట్ మసాలా పోగ్రామ్ లు అప్పట్లో పెట్టాయి. వాటికి భీబత్సమైన రేటింగ్ వచ్చింది. అయితే విమర్శలు ఎక్కువ రాటంతో ఆ పోగ్రామ్ లు వేయటం మానుకున్నారు.

English summary
Have you seen moralistic porn? These sex shows on Tamil TV channels will amaze you. Pornography is considered as a crime in India and have you ever thought about moralistic pornography. It is a new genre found by Tamil television channels to increase their viewers and rating. It is good to give awareness to the people about sex and related matters. But what happens is completely against the moral standards.
Please Wait while comments are loading...