»   » ఆనవ్వుల వెనుక ఎంత విషాదం ఉందో తెలుసా : జబర్దస్త్ రైజింగ్ రాజు

ఆనవ్వుల వెనుక ఎంత విషాదం ఉందో తెలుసా : జబర్దస్త్ రైజింగ్ రాజు

తన కామెడీ టైమింగ్ తో నవ్వించే రాజు జీవితం కూడా అందరు కమేడియన్ల లాగానే వడ్డించిన విస్తరేం కాదు. ఇప్పటి స్థాయిని చేరుకోవటానికి ఆయన పడ్డ కష్టాలూ మామూలువి కాదు

Posted by:
Subscribe to Filmibeat Telugu

జీవితం అలానే ఉంటుంది సక్సెస్ కోసం పరుగులు తీసేవాడి కొసం అర్రులు చాచే వాడికోసం ఒక్కటంటే ఒక్కరోజుని దాచీ దాచీ పరుగులు తీయిస్తుంది. నవ్వించే నటుల వెనుక ఎన్ని కన్నీళ్ళుంటాయనేది చార్లీచాప్లిన్ జీవితం పెద్ద ఉదాహరణ. అదేం విచిత్రమోగానీ కమేడియన్ల జీవితాల వెనుక ఉన్న విషాదాన్ని చూస్తూంటే ఈ మనిషేనా మన భాదల్ని మరిపిస్తూ ఇంత నవ్విస్తున్నాడూ అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న టీవీ ప్రొగాముల్లో రారాజు గా ఉన్న కామెడీ ప్రొగ్రాం "జబర్దస్త్" లో ఉన్న కమేడియన్లు మనల్ని ఎంత నవ్విస్తున్నారో తెలిసిందే అయితే ఆ నవ్వుల వెనుక ఉన్న కన్నీళ్ళ గురించి తెలిస్తే మాత్రం ఒక్కసారి మనస్సు చివుక్కు మనక మానదు.

రైజింగ్ రాజు జబర్దస్త్ లో హైపర్ ఆదీ తో పాటు కనిపించే బక్కపలచని మనిషి. అద్బుతమైన కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో హైపర్ ఆది టీం ని నిలబెట్టటం లో రైజింగ్ రాజు పాత్ర కూడా చాలనే ఉంది. ఆది కి పర్ఫెక్ట్ జోడీగా తన కామెడీ టైమింగ్ తో నవ్వించే రాజు జీవితం కూడా అందరు కమేడియన్ల లాగానే వడ్డించిన విస్తరేం కాదు. ఇప్పటి స్థాయిని చేరుకోవటానికి ఆయన పడ్డ కష్టాలూ మామూలువి కాదు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వాసి తన జీవితం లో ఎన్ని కష్టాలు పడ్డాడు అంటే....

ఇంటర్వ్యూ లో:

ఇంటర్వ్యూ లో:

అసలు రాజు ఇప్పుడు మనకు తెలిసాడు గానీ 1979 లోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అంతే దాదాపు 40 సంవత్సరాలనుంచీ తాను నటుడిగా నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తూనే వచ్చాడు. అసలు రాజు ఇండస్ట్రీలోకి రాకముందూ, వచ్చినతర్వాతా ఎదుర్కొన్న అనుభవాల గురించి ఈ మధ్యనే ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇలా చెప్పుకొచ్చాడు.

నూతన్ ప్రసాద్ :

నూతన్ ప్రసాద్ :

1979 లోనే నటుడు నూతన్ ప్రసాద్ ఒక సినిమా నిర్మించాడు. ఆసినిమాకి రైజుంగ్ రాజు అన్నయ్య అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఆ సినిమా ఆఫీసు లోనే రాజు నీ ఆఫీస్ బాయ్ గా చేర్పించాడట. అయితే ఆ ఆఫీసు లోనే క్యాషియర్ గా పని చేస్తున్న నూతన్ ప్రసాద్ స్నేహితుడైన వేజెల్ల సత్యనారాయణ తో పరిచయం కలిగింది.

మరో మలుపు అనే సినిమా:

మరో మలుపు అనే సినిమా:

ఆయన తనదగ్గర అసిస్టెంట్ గా చేరమని చెప్పటం తో అక్కడికి మారిపోయాడు రాజు. 1981లో మరో మలుపు అనే సినిమాలో రాజుకు అవకాశం ఇచ్చాడట. అలా సినిమా నటనలోకి అడుగుపెట్టాడు. అయితే అడపాదడపా తప్ప అవకాశాలు లేకపోవటం తో మళ్ళీ ఊరు వెళ్ళిపోయాడు.

డబ్బులు సరిపోక:

డబ్బులు సరిపోక:

ఆ తరవాత నవీన్ అనే ఫ్రెండ్ తో కలిసి 30-40 దాకా షార్ట్ ఫిలిమ్ లు తీస్తూ అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళట. ఇండస్ట్రీలో వెంటవెంటనే అవకాశాలు రావటం మామూలు విషయం కాదు. ఇక్కడ అవకాశాలు రాక కుటుంబాన్ని పోషించటానికి. ఇంటి అద్దెలకు కూడా డబ్బులు సరిపోక నానాయాతనలూ పడ్డాడడట.

పెయింటింగ్ పనికి కూడా:

పెయింటింగ్ పనికి కూడా:

ఆఖరికి పెయింటింగ్ పనికి కూడా వెళ్ళి మరీ ఇంటిని పోషించుకోవాల్సి వచ్చేది. ఇటు ఈ పనులు చేయటం , వీలుకుదిరినప్పుదల్లా సినిమా ఆఫీసుల చుట్టూ తిరగతం. కొన్ని సంవత్సరాల పాటు ఇదే పని. ఒక పక్క నటున్ని కావాలనే తపనా..., ఇంకో పక్క సినిమాల చుట్టూ తిరిగితే ఇప్పుడు చేస్తున్న పనిలో వచ్చే 100, 200 లూకూడా ఎక్కడ చేతికందకుండా పోతాయో అన్న భాదా ఈ రెండిటి మధ్యా నలిగి పోయేవాడట.

చలాకీ చంటి:

చలాకీ చంటి:

కొన్నేళ్ళలా గడిచి పోయాక మళ్ళీ జబర్దస్త్ మొదలయ్యాక ఒక సినిమా షూటింగ్ కోసం చలాకీ చంటి రామచంద్రాపురం వెళ్ళటం అక్కడ కొందరు రాజు గురించి చెప్పి అతన్ని చంటి టీం కి రికమండ్ చేయటం జరిగింది. మొదట్లో చంటి టీం లోనూ ఆతర్వాత సునామీ సుధాకర్ టీం లోనూ కొనసాగాడు.

కొన్ని స్కిట్లు:

కొన్ని స్కిట్లు:

ఆ తర్వాత ఆదితో కలిసి చేసిన కొన్ని స్కిట్లు అద్బుతంగా పేలటం తో ఇక రైజిగ్ రాజు రైజ్ అయిపోయాడు. ఇక ఇప్పుడు హైపర్ ఆది తో తనకు బాగా కలిసి వచ్చిందంటాడు రాజు. ఇంత వయసొచ్చాక సంపాదనలో, తనకూ ఒక గుర్తింపు రావటం లో ఆది పాత్ర ఖచ్చితంగా ఉందంటాడు.

ఇలా జీవితాన్నిచ్చింది:

ఇలా జీవితాన్నిచ్చింది:

ఒకప్పుడు ఒక్క అవకాశం వస్తుందేమో, ఎవరన్నా చిన్న సాయం చేస్తారేమో అని ఎదురు చూసేవాన్ని... ఇక బయట కూడా పనులు చేసే వయస్సు అయిపోతుందనుకున్న సమయం లో జబర్దస్త్ మళ్ళీ నాకు ఇలా జీవితాన్నిచ్చింది అంటూ తన గురించి చెప్పాడు రైజింగ్ రాజు.

Images Courtesy : ETV

English summary
Jabardasth 'Raising Raju' shared some movements frome his Personal life in a Latest interview
Please Wait while comments are loading...