twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీ రెడీ... ఈ రోజు రాత్రి 9గం.30 కి

    By Srikanya
    |

    హైదరాబాద్ : అవును... ఈ రోజు రాత్రి 9గం.30 గంటలకు ఈటీవీ సాక్షిగా ఓ అద్బుతం పెదవి విప్పుతోంది. అదేమిటో అర్దమైపోయిందా...మీ గెస్ కరెక్టే... ప్రముఖ దర్శకుడు, మౌనముని రాఘవేంద్రరావు గారు 'సౌందర్యలహరి' తో మన ముందుకు రానున్నారు. ఆయన వెండి గడ్డం మాటున ముసిముసిగా నవ్వడం తప్ప - గొంతు వినిపించింది లేదు. ఇప్పుడా తెలుగు ప్రేక్షకులకు అదృష్టం దక్కింది. రాఘవేంద్రరావు మౌనం వీడి మాట్లాడబోతున్నారు. ఇన్నాళ్లుగా మనసు మాటునే ఆగిపోయిన ఎన్నో వేల కబుర్లు, వందల ముచ్చట్లు, వెలకట్టలేనన్ని సంగతులూ వరుస కట్టబోతున్నాయి. రాఘవేంద్రరావు స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభవేళ.. మౌనం వీడుతున్నారు. ఆ 'సౌందర్యలహరి' ప్రతి ఆదివారం రాత్రి 9గం.30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం కానుంది.

    సినీతారలతో ఆయనకున్న అనుబంధం, పాటల చిత్రీకరణ కోసం చేసిన కసరత్తులు, సెట్లో జరిగిన మధురమైన సంఘటనలూ... ఒక్కటేమిటి? అన్నీ... 'సౌందర్యలహరి'లో ప్రేక్షకులతో పంచుకోబోతున్నారు దర్శకేంద్రుడు. హీరోలు, హీరోయిన్స్ , హాస్యనటులు, సంగీత దర్శకులు, గీత రచయితలు, నిర్మాతలు... ఇలా ఎంతోమంది రాఘవేంద్రరావుతో కలసి ప్రయాణం చేశారు. వీరందరి అనుభవాల మాలిక ఈ కార్యక్రమం. 'రాఘవేంద్రరావు అంటే ఏమిటి?' అని వాళ్లని అడిగితే ఒకొక్కరూ ఒక్కోరకంగా స్పందిస్తారు. అందులో చిలిపి వర్ణణలకు లెక్కేలేదు. అవన్నీ తెలుసుకొనే ప్రయత్నం.. 'సౌందర్యలహరి'. మొత్తం 26 ఎపిసోడ్స్ ను రూపొందించారు. అందులో మొట్టమొదటి ఎపిసోడ్ ఈ రోజు రాత్రి 9గం.30ని.లకు ఈటీవీలో ప్రసారం కానుంది.

    K Raghavendra Rao to host a talk show in Telugu

    ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. మౌనమునిని మాటలగనిగా మార్చే మహత్తర బాధ్యత తీసుకొన్నారు. బాలు పరిచయ కార్యక్రమంతో 'సౌందర్య లహరి' ప్రారంభం కానుంది. రాఘవేంద్రరావుకి ఎంతో ఇష్టమైన దర్శకుడు కె.విశ్వనాథ్‌ తొలి ఎపిసోడ్‌కి హాజరవుతున్నారు. ఆయనతో పాటు.. శతాధిక చిత్రాల నిర్మాత డి.రామానాయుడు కూడా పాల్గొంటారు. కె.విశ్వనాథ్‌తో రాఘవేంద్రరావుకి ఉన్న అనుబంధంతో పాటు కొన్ని ఆసక్తికరమైన సంఘటల్ని రాఘవేంద్రరావు పంచుకోబోతున్నారు. మాటల విందుకి ఈ రోజే ఆరంభం. దర్శకేంద్రుడు ఛమక్కులు, తారల తీపి కబుర్లు, మధురమైన ముచ్చట్లకు ఈరోజే తెర తీయనున్నారు.

    రాఘవేంద్రరావు గారు మాట్లాడితే.. అదో అపురూప జ్ఞాపకాల సంగమం అవుతుంది. ఆ మాటల్ని రాసుకొని దాచుకొంటే విలువైన పుస్తకం అవుతుంది. ఎందుకంటే ఆయన వెనుక 50 ఏళ్ల ప్రయాణం ఉంది. నాలుగు దశాబ్దాల దర్శకత్వ ఘనత ఉంది. వంద సినిమాల చరిత్ర ఉంది. ఏ హీరోయిన్ ని ఏ కోణంలో చూపిస్తే అందంగా కనిపిస్తుందో ఆయనకు బాగా తెలుసు. సన్నివేశం ప్రేక్షకుల గుండెలకు హత్తుకోవాలంటే ఎలాంటి మాయ చేయాలో ఆయనకు తెలుసు. ఇవన్నీ మనతో పంచుకొంటే... ఎంత బాగుంటుంది అన్న ఆలోచనే ఈ పోగ్రాం వెనక ఉన్న ప్లానింగ్ అంటున్నారు 'ఈటీవీ' వారు. అందుకే 'సౌందర్యలహరి' ఆవిష్కృతమైంది.

    English summary
    K Raghavendra Rao's mega debut on small screen for the show 'Soundarya Lahari' has been the talk of the town. The Legendary director's decision to host a show and surprised many including the industry bigwigs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X