Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
`పిల్లా నువ్వు లేని జీవితం' శాటిలైట్ రైట్స్
హైదరాబాద్ : సాయిధరమ్‌తేజ్ హీరోగా లాంచ్ అవుతూ చేసినచిత్రం `పిల్లా నువ్వు లేని జీవితం' మొన్న శుక్రవారం విడుదల అయ్యిది. రెజీన హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్-శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స సంయుక్తంగా నిర్మించాయి. బన్ని వాసు-శ్రీ హర్షిత్ నిర్మాతలు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. అనూప్ రూబెన్స సంగీతం అందించారు. ఈ చిత్రం మార్నింగ్ షోకే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులను మాటీవి వారు సొంతం చేసుకున్నారు. దాదాపు మెగా హీరోలు, నాగార్జున కుటుంబానికి చెందిన సినిమాల శాటిలైట్ రైట్స్ ని సాధారణంగా మాటీవి తీసుకుంటూంటుంది. అలాగే ఈ చిత్రం రైట్స్ సైతం మంచి రేటు చెల్లించి తీసుకుందని సమాచారం.
ఈ చిత్రం కథలో గంగ ప్రసాద్(షాయీజీ షిండే), ప్రభాకర్(ప్రకాష్ రాజ్) ఇద్దరూ పొలిటీషన్స్...బద్ద శత్రవులు. సిఎం పోస్ట్ కోసం పోటీ పడుతూంటారు. ఈ లోగా వై ఛానెల్ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టు షఫీ... వీరిద్దరు గురించి కొన్ని నిజాలు వెలికి తీస్తాడు. దాంతో ఆ జర్నలిస్టు ని, మరో అమ్మాయిని చంపేయటానికి ఓ రౌడీ మైసమ్మ(జగపతిబాబు)కి సుపారి ఇస్తారు. దాంతో మైసమ్మవారిని చంపేయటానికి వెతుకుతూంటాడు. ఈ లోగా పాలకొల్లు నుంచి వచ్చిన శ్రీను(సాయి ధరమ్ తేజ) మైసమ్మ డైన్ లోకి వచ్చి తనని చంపేయమని అంటాడు. షాకైన మైసమ్మ ఎందుకలా అన్నావు అనిడిగే... తనకు సిరి(రెజీనా)తో ఉన్న లవ్ స్టోరీ ని చెప్తాడు. అంతేకాకుండా... ఓ షాకింగ్ ట్విస్ట్ ని రివిల్ చేస్తాడు. ఆ షాకింగ్ ట్విస్ట్ ఏమిటి... మైసమ్మ చంపుదామనుకున్న అమ్మాయి ఎవరు.. అసలు దీని వెనక ఉన్న అసలు నిజం ఏమిటనేది మిగతా కథ.
ఇక ఈ చిత్రం 400 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతగా 50 సినిమాలు తెరకెక్కించా. నేను నిర్మించిన 50సినిమాలు ఒక ఎత్తు. పిల్లా నువ్వు లేని జీవితం ఇంకో ఎత్తు. పెద్ద విజయం సాధిస్తుంది అన్నా మెగా నిర్మాత అల్లు అరవింద్. ఈ సినిమా గొప్ప ఫీల్‌గుడ్ లవ్‌స్టోరి. సాయిధరమ్ తేజ్ హీరోనే కాదు స్టార్ మెటీరియల్ అని నిరూపించే సినిమా ఇది. తప్పక విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారాయన.
మరో నిర్మాత దిల్‌రాజు సైతం సాయిధరమ్‌పై పెద్ద రేంజులో ప్రశంసలు కురిపించారు. బన్నికి `ఆర్య'లా, నితిన్‌కి `దిల్'లా, చరణ్‌కి `మగధీర' లా సాయిధరమ్‌కి `పిల్లా నువ్వు లేని జీవితం' అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సాయిధరమ్ డ్యాన్సింగ్ స్టయిల్, ఎనర్జీ ఈ సినిమాకి పెద్ద అస్సెట్ అవుతాయని రెజీన చెబుతోంది. ఇద్దరు అభిరుచి ఉన్న నిర్మాతల కలయికలో వచ్చిన సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.