twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాస్ కాకుండా మంచు ఫ్యామిలీకి మాటీవీ అండ

    By Srikanya
    |

    హైదరాబాద్ : మంచు కుటుంబ చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' టాక్ పరంగా బాగున్నా...కలెక్షన్స్ పరంగా యావరేజ్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. దాంతో బిజినెస్ క్లోజ్ అయ్యే సమయానికి వరల్డ్ వైడ్ గా దాదాపు 12 కోట్లు మాత్రమే కలెక్టు చేసి, 8 కోట్లు వరకూ లాస్ మిగిల్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే మాటీవీ వారు శాటిలైట్ రైట్స్ తీసుకుని ఆ లాస్ నుంచి కొంతలో కొంత బయిటపడేసారని టాక్. మాటీవీ వారు ఈ చిత్రానికి 4.25 కోట్లు శాటిలైట్ రైట్స్ నిమిత్తం చెల్లించటానికి ముందుకు వచ్చారని అంటున్నారు. మరో ప్రక్క మళయాళంలో ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ విడుదల చేసి రికవరీ చేస్తున్నారు.

    చిత్రంలో మోహన్ బాబు పాత్ర పేరు నాయుడు. ఆ పాత్ర నోటికి దురుసు ఎక్కువ. చేతికి దురదెక్కువ. సినిమాలో విష్ణు రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తాడు. మనోజ్‌ స్త్రీ పాత్రలో కనిపిస్తాడు. బృహన్నలగా ఎన్టీఆర్‌గారికి ఎంత పేరు వచ్చిందో ఇందులో మోహినిగా మనోజ్‌కి అంతటి పేరు వచ్చిందని చెప్తున్నారు. సినిమా ద్వితీయార్ధంలో మనోజ్‌ మోహినిగా విజృంభించాడు.

    MAA TV saved Manchu Family from losses

    దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ "మొదట ఈ సినిమాని మోహన్‌బాబు, విష్ణు హీరోలుగా అనుకుని మొదలుపెట్టాం. తర్వాత కథ మారింది. మనోజ్, వరుణ్, తనీశ్ పాత్రలు కూడా వచ్చి చేరి, 'పాండవులు పాండవులు తుమ్మెద' అయ్యింది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకుణ్ణవడం అదృష్టంగా భావిస్తున్నా. సెకండాఫ్‌కి మనోజ్ కేరక్టర్ హైలైట్. మూగవానిగా తనీశ్ మంచి నటన ప్రదర్శించాడు'' అని తెలిపారు.

    మోహన్ బాబు మాట్లాడుతూ...''నేను పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో నటించి పదేళ్లవుతోంది. నా కొడుకులు హీరోగా మంచి స్థానంలోకి వచ్చారు. ముగ్గురం కలసి నటిద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కథ కోసం ఇన్నాళ్లు ఆగాం. 'రావణ' చేద్దామనుకుంటే దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా చేశాం. మేం అనుకున్నట్లుగా సినిమా చక్కగా వచ్చింది. రవి, కోనవెంకట్‌, బీవీఎస్‌రవి, గోపీమోహన్‌ చక్కటి కథని సిద్ధం చేశారు. దాన్ని శ్రీవాస్‌ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మంచు విష్ణు, మనోజ్‌, వరుణ్‌సందేశ్‌, తనీష్‌, రవీనాటాండన్‌, హన్సిక, ప్రణీత తమ పాత్రలమేరకు చక్కటి ప్రతిభకనబర్చారు. '' అన్నారు.

    English summary
    As per trade reports, ‘Pandavulu Pandavulu Tummeda’ has collected Rs 12 crore for full run worldwide and ends with deficit of 8 crores.But PPT satellite rights were sold for good price of around Rs 4.25 crores to MAA TV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X