»   »  మణిరత్నం 'ఓకే బంగారం' : టీవీలో ఎప్పుడంటే

మణిరత్నం 'ఓకే బంగారం' : టీవీలో ఎప్పుడంటే

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దుల్కర్‌ సల్మాన్‌, నిత్యమేనన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం 'ఓకే కన్మణి'. మణిరత్నం దర్శకుడు. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని 'ఓకే బంగారం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దిల్‌ రాజు. తెలుగులోనూ మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో బుల్లి తెరపై అలరించనుంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ తీసుకున్న జీ తెలుగు వారు...26 జూలై సాయింత్రం ఆరు గంటలకు ప్రసారం చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లే ముందు ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి ముంబయిలోని ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ క్రమంలో వారిద్దరి మధ్య చోటు చేసుకొన్న పరిణామాలు ఎలాంటివన్నది తెరపైనే చూడాలి


Mani Ratnam' Ok Bangaram in small screen on

చిత్రం విశేషాల్లోకి వెళితే..

దిల్ రాజు మాట్లాడుతూ ''పదిహేనేళ్ల క్రితం మణిరత్నం తీసిన 'సఖి' ఎలాంటి విజయం సాధించిందో అదే స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిందీ చిత్రం. చిత్రానికి చక్కటి స్పందన లభించింది''అన్నారు.


ఇప్పటికే విడుదలైన చిత్రం హిట్టైంది. గతంలో ఏ. ఆర్. రెహమాన్, మణిరత్నంల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ ఆల్బంలలానే ఓకే బంగారం ఆడియో ఉండటంతో అభిమానులకు పండగ చేసుకున్నట్లైంది. మొత్తం తొమ్మిది పాటలున్న ఈ ఆల్బం మణిరత్నం మార్క్‌తో సాగింది. తమిళంలో వైరముత్తు ఈ పాటలకు సాహిత్యాన్ని అందించగా, తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ బాధ్యతను నిర్వహించారు. పిసి శ్రీరామ్ కెమెరా వర్క్,ఎఆర్ రహమాన్ సంగీతం హాంట్ చేస్తోంది.


ఇదొక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ. సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మణిరత్నం ‘ఒకే బంగారం'తో తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూపిస్తాడు. అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. తమిళంలో సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ‘ఒకే కన్మణి'ను నిర్మించారు.


మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు.


మౌనరాగం, ఇదయత్తైతిరుడాదే (తెలుగులో గీతాంజలి), రోజా, అలప్పాయిదే వంటి ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయి. తాజాగా అలాంటి అద్భుత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథ విని బల్క్ కాల్‌షీట్స్‌ను దుల్కర్ సల్మాన్ కేటాయించగా నటి నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు.


చిత్ర కథను దర్శకుడు చెప్పగానే స్ఫెల్‌బౌండ్ అయిపోయానని నిత్యామీనన్ అన్నారు. కాగా ఈ చిత్రంలో ముఖ్యభూమికను పోషిస్తున్న ప్రకాష్‌రాజ్ చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రంలో నటిస్తున్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


హీరోయిన్‌గా మొదట ఆలియా భట్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా నిత్యామీనన్ సీన్ లోకి వచ్చింది. నిత్య, దుల్ఖర్ ఇద్దరూ కలిసి నటించిన ‘ఉస్తాద్ హోటల్' మంచి హిట్ కొట్టింది. వీరిద్దరూ బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా వనితా ఫిల్మ్ అవార్డుకూడా అందుకున్నారు.


నిత్యా మీనన్ మాట్లాడుతూ... ‘‘మణిరత్నంలాంటి విజన్‌ ఉన్న దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరీర్‌ని ఎప్పుడూ ప్రత్యేకంగా ప్లాన్‌ చేయలేదు. అయినా చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోంది'' అని అంటోంది నిత్యామీనన్‌.


ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్.

English summary
Manirantam's ‘Ok Bangaram’ will be screened on small screen on Zee Telugu on 26th July at 6 PM.
Please Wait while comments are loading...