twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లక్ష్మీ.. రావే మా ఇంటికి’ టీవీలో వేసేస్తున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగశౌర్య హీరోగా గిరిధర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై గిరిధర్‌ మామిడిపల్లి నిర్మించిన చిత్రం ‘లక్ష్మీ.. రావే మా ఇంటికి'. ‘ఉయ్యాల జంపాల' ఫేమ్‌ అవికా గోర్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా నంద్యాల రవి దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రాన్ని ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న జీ టీవిలో వేస్తున్నారు. అవికాగోర్ కు టీవీ మీడియంలో ఉన్న క్రేజ్ తో టీఆర్పీలు బాగా వస్తాయని భావిస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ‘ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్యా' తర్వాత హీరోగా నాగ శౌర్యకు చేసిన చిత్రం ఇది. ఇందులో నాగశౌర్య పాత్ర పేరు సాయి. ఎనర్జిటిక్‌, జోవియల్‌, రెస్పాన్సిబుల్‌ కేరక్టర్‌. ‘బొమ్మరిల్లు'లాంటి ఇంట్లో ఇడియట్‌ తరహా పాత్ర. ఈ కథకు లైఫ్‌ నాగశౌర్య కేరక్టరే. లక్ష్మి పాత్ర చుట్టూ కథ తిరిగితే, నాగశౌర్య... లక్ష్మి చుట్టూ తిరుగుతానన్న మాట. ‘లక్ష్మీ.. రావే మా ఇంటికి' అని పోరు పెట్టేది నాగశౌర్యే.

    చిత్రం కథేమిటంటే....

    Naga Sourya's Lakshmi Raave Maa Intiki on Zee TV

    'తండ్రి కుక్కను పెళ్ళి చేసుకోమంటే చేసుకుంటాను' అనే క్యారెక్టర్ హీరోయిన్ లక్ష్మి (అవికా గోర్)ది. ఆమెకు నిశ్చితార్థం జరిగిందని తెలిసి కూడా ఎలాగైనా ప్రేమలో పడేయాలని తాపత్రయపడే కుర్రాడు సాయి (నాగశౌర్య). ప్రేమగీమా జాన్తా నై అనే ఈ కుర్రాడు.. లక్ష్మిని చూసిన తొలి నిమిషంలోనే ప్రేమలో పడిపోతాడు. అతని దురదృష్టం కొద్ది అప్పటికే ఆమెకు తండ్రి చూపించిన అబ్బాయితో నిశ్చితార్థం జరిగిపోతుంది. అయినా... లక్ష్మీని ఎలాగైనా లవ్ ట్రాక్ ఎక్కించాలని సాయి తెగ ట్రై చేస్తాడు.

    ‘నన్ను కాదు కానీ మా నాన్నని లైన్ లో పెట్టు... ఎందుకుంటే మా నాన్న కుక్కని చేసుకోమన్నా చేసుకుంటాను' అని ఓ ఉచిత సలహా ఇస్తుంది లక్ష్మీ. దాంతో ఆమె తండ్రిని, పనిలో పనిగా కుటుంబం మొత్తాన్ని లైన్ లో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ పథకం మధ్యలోనే బెడిసి కొట్టడంతో ఇంట్లోంచి గెంటబడతాడు. అయితే... లక్ష్మీకి ఒకానొక సందర్భంలో సాయి సాయపడతాడు.

    అతని సహకారానికి సంతోషపడిన లక్ష్మీ అతన్ని గాఢంగా హత్తుకుంటుంది. ‘నా మీద నీకు ప్రేమలేకపోతే... నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా ఇలా ఎలా చేస్తావ్?' అంటూ పాయింట్ లేవదేస్తాడు సాయి. ఆమె మనసులో తనకు చోటు ఉందని గ్రహించిన సాయి... లక్ష్మీని పెళ్ళికి ఎలా ఒప్పించాడు? ఈ కుర్రాడి మీద సదాభిప్రాయం లేని లక్ష్మీ తండ్రి వీరి పెళ్ళికి ఎలా ఆమోదముద్ర వేశాడు? అన్నది మిగతా కథ.

    కె.ఎం. రాధాకృష్ణన్ బాణీలు, నేపథ్యం సంగీతమూ ఓ.కే. కథ విషయంలోనే నంద్యాల రవి ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేదని టాక్ వచ్చింది. అవికా, నాగశౌర్య, రావు రమేశ్ తదితరులు తమ నటనతో సినిమాను బాగానే నెట్టుకొచ్చారని ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు. మరి మామిడిపల్లి గిరిధర్ నిర్మించిన ఈ తొలి చిత్రాన్ని టీవి ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారన్నది వేచి చూడాలి!

    English summary
    Avika Gor,Naga Shourya's ‘Lakshmi Raave Maa Intiki’ will be screened in Zee TV to celebrate Womens Day on March, 8th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X