twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్: అప్పుడే టీవీల్లో వేసేస్తున్నారా?

    By Srikanya
    |

    హైదరాబాద్: నాగచైతన్య, పూజహెగ్డే జంటగా నటించిన చిత్రం 'ఒక లైలా కోసం'. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. క్రిందటి నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ మూట కట్టుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని టీవిలో ప్రీమియర్ షో వేసేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. థియోటర్ లో చూడనివారంతా ఈ కొత్త చిత్రం టీవీ లో చూడవచ్చు అంటున్నారు. నవంబర్ 23 న మాటీవిలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ఇది పెద్ద రికార్డ్ క్రిందే చెప్పాలి. ఎందుకంటే ఇంత త్వరగా ఓ పెద్ద సినిమా రిలీజయ్యి ఎంతో కాలం కాకుండా టీవిల్లో వేయటమనేది రికార్డే.

    చిత్రం కథేమిటంటే...
    జాబ్ వద్దనుకుని టూర్ కి బయిలు దేరిన కార్తీక్ (నాగ చైతన్య) కి నందన(పూజా హేగ్డే) పరిచయం అవుతుంది. ఆమె ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఫిక్సైతాడు కార్తీక్. అయితే ఆమె మాత్రం అతన్ని కొన్ని విచిత్రమరైన పరిస్దితుల్లో అతన్ని దూరం నుంచి చూసి తనకు తాను వేరే విధంగా ఊహించుకని... ద్వేషం పెంచుకుంటుంది. ఇది తెలియని కార్తీక్ తర్వాత లవ్ ప్రపోజ్ చేసి దెబ్బతింటాడు. ఈ లోగా వీరిద్దరి ఇంట్లో వాళ్ళు వీరికి పెళ్ళి చూపులు ఎరేంజ్ చేస్తారు. ఆమె పై ప్రేమతో కార్తీక్, తండ్రి మాట కాదనలేక నందన పెళ్ళికి ఒప్పుకుంటారు. అప్పుడు కార్తీక్ ఓ నిర్ణయం తీసుకుంటాడు ఈ పెళ్లి అయ్యేలోగా ఎలాగైనా ఆమెను తన ప్రేమలో పడేయాలని...అలాగే నందన కూడా ఓ నిర్ణయం తీసుకుంటుంది...ఎలగైనా ఈ పెళ్లి ఆపాలి అని...వీరిద్దరిలో ఎవరి ప్రయత్నం ఫలించింది...చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే.

    Oka Laila Kosam: creates record with premier

    నాగార్జున మాట్లాడుతూ ''నాగచైతన్య కెరీర్‌లో చాలామంచి సినిమా. తనకు రొమాంటిక్‌ ఇమేజ్‌ తొలి సినిమాతోనే వచ్చేసింది. 'ఒక లైలా కోసం'తో అది నిలబడిపోతుంది. విజయ్‌కుమార్‌ కొండా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. పతాక సన్నివేశాల్లో ఎమోషన్స్‌ బాగా పండాయి. అనూప్‌ పాటలకూ మంచి స్పందన వస్తోంది''అన్నారు. ''ఇదో ఫీల్‌గుడ్‌ సినిమా. విశ్రాంతికి ముందొచ్చే సన్నివేశం నాకు బాగా నచ్చింద''ని నాగచైతన్య తెలిపారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''కార్తీక్‌ అనే ఓ మజ్నూ కథ ఇది. ప్రేమించిన అమ్మాయికి ఇప్పటి వరకూ ఎవరూ ఇవ్వలేని బహుమతి ఇస్తాడు. అలీ పాత్ర నవ్వులు పండిస్తుంద''న్నారు. ''నిజానికి నాకు రీమిక్స్‌ అంటే భయం. పాత పాటని చెడగొట్టేస్తానేమో అని కంగారు పడుతుంటా. కానీ ఈ సినిమాలో 'ఒకలైలా కోసం' పాట బాగా వచ్చింద''ని అనూప్‌ తెలిపారు.

    అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.

    English summary
    Naga Chaitanya,Pooja Hegde's romantic entertainer Oka Laila Kosam is getting screened on small screen on 23rd Nov. Film will be screened on MAA TV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X