twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్నప్పటినుంచి నాకు భయమే, క్షమించాలి,నాకు కొత్త: పవన్ కళ్యాణ్ ( ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ 'భక్తి టీవి' వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కోటిదీపోత్సవానికి హాజరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ మాటల్లో భాగంగా ఆయన దృష్టిలో భగవంతుడు అంటే ఏమిటనేది స్పష్టం చేసారు.

    హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ... కోటికాంతులు విరజిమ్మే కార్తీక దీపతోరణంలోఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. కోటి దీపోత్సవంలో భాగంగా 13వ రోజు భక్తులచేత మహాగణపతికి కోటి గరికార్చన, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి కల్యాణం, లంబోదరుడి మూషికవాహన సేవ జరిగాయి.

    నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో వివిధ దేవుళ్లని ఆరాధిస్తూ కోటీ దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు.

    ఇంతకీ అక్కడ పవన్ ఏం మాట్లాడారో క్రింద చదవండి..

    ఇక్కడకి వచ్చిన అందరికీ

    ఇక్కడకి వచ్చిన అందరికీ

    ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...ఇక్కడికి వచ్చిన స్వామి హరికృప ఫీఠాదీశ్వర్ హరిచైతన్య పూరీజీ మహరాజ్ గారికి, స్వామి సుఖభోధానంద స్వామి గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, అక్క చెల్లిళ్లందరికీ , ఆడబడుచులందిరీ, మహిళా శక్తి అందరికీ పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు.

    నాకు సంభందించి కాదు

    నాకు సంభందించి కాదు

    ఇది నాకు సంభందించినే వేదిక కాకపోయినా నన్ను ఇక్కడికి పిలిచి, , ఇలాంటి హారతులు దర్శించుకునే అవకాసం నాకు కల్పించారు. ఇలాంటి అవకాసం నాకు చాలా అరుదుగా దొరుకుతుంది. ఇలాంటి అవకాసం ఇచ్చిన శ్రీ నరేంద్ర చౌదరి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

    నన్ను ఆ భయమే...

    నన్ను ఆ భయమే...

    చిన్నప్పటినుంచీ నాకు భగవంతుడు అంటే చాలా భయం. నన్నెవరైనా చూస్తున్నారు ఎప్పుడూ, తప్పు చేస్తే ఏదైనా చేస్తారనే భయమే నన్ను జాగ్రత్తగా ఉంచింది అంటూ పవన్ కళ్యాణ్ భగవంతుడు గురించి రెండు ముక్కల్లో చక్కగా చెప్పారు. తను ఈ రోజున తప్పు చేయకుండా ఉండటానవికి కారణం భగవంతుడే అని తేల్చి చెప్పారు.

    క్షమించాలి

    క్షమించాలి

    నాకు ఇలాంటి పరిస్దితుల్లో , క్షమించాలి, నాకు కొత్తగా ఉంది. ఇలా మాట్లాడటం అని పవన్ అన్నారు. ఎప్పుడూ సినిమా ఫంక్షన్స్ లోనో, సెట్స్ మీదో లేక పొలిటికల్ మీటింగ్ లలో మాట్లాడే పవన్ ఇలా ...భగవంతుడు గురించి చెప్పటం నిజానికి అందిరికీ ఆశ్చర్యమే. ఆయనకే కాదు.

    ఇచ్చేవాడు కాదు...

    ఇచ్చేవాడు కాదు...

    నా దృష్టిలో భగవంతుడు అంటే ధర్మాన్ని కాపాడటం అని నమ్ముతాను., నాకు భగవంతుడు అంటే ఏంటంటే అడిగినవి ఇచ్చేవాడు కాదు..మనకి అవసరమైనవి ఇచ్చేవాడు అని నమ్ముతాను. అలాంటి భగవంతుడు అందరికీ ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను అన్నారు పవన్ కళ్యాణ్.

    నా పేరు వద్దు...

    నా పేరు వద్దు...

    ఎప్పిటిలా ఈ ఆధ్యాత్మిక సదస్సు లో కూడా పవన్ స్పీచ్ చెప్తున్నప్పుడు అభిమానులు పవన్ , పవర్ స్టార్..పవర్ స్టార్ అంటూ నినాదాలు చేసారు. వెంటనే పవన్...వారిని ఉద్దేశించి...భగవంతుడుది ఇక్కడ ,దయచేసి నా పేరు వద్దు అని పవన్ ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేసారు.

    ప్రస్తుతం పవన్

    ప్రస్తుతం పవన్

    పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన హీరోగా డాలి దర్శకత్వంలో కాటమరాయుడు అనే చిత్రం రూపొందుతోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ అది. తమిళంలో విజయవంతమైన వీరమ్ చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రం పూర్తి ఫన్ తో ఎంటర్టైన్మెంట్ తో సాగనుంది.

    వేదాలం రీమేక్

    వేదాలం రీమేక్

    ఓ ప్రక్కన వీరమ్ చిత్రం రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ..అదే అజిత్ నటించిన మరో తమిళ సినిమా వేదాలం రీమేక్ సైతం చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు నేశన్ డైరక్ట్ చేస్తారు. ఇప్పటికే ఈ చిత్రం లాంచింగ్ జరిగింది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులులో ఈ చిత్రం తెరకెక్కనుంది.

    ఇంకో సినిమా

    ఇంకో సినిమా

    పవన్ ఈ రెండు చిత్రాలతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం లాంచ్ చేసారు. నిర్మాత చినబాబు బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల సక్సెస్ తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే మంచి క్రేజ్ వస్తుంది మార్కెట్ లో అని భావిస్తున్నారు.

    నితిన్ సినిమా ప్రొడ్యూస్ చేస్తూ

    నితిన్ సినిమా ప్రొడ్యూస్ చేస్తూ

    ఇక ఈ సినిమాలతో పాటు తన బ్యానర్ తన వీరాభిమాని నితిన్ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మూల కథ అందిస్తున్నారు. ఈ దర్శకుడు గతంలో నారా రోహిత్ తో రౌడి ఫెలో అనే చిత్రం డైరక్ట్ చేసి ఉన్నాడు.

    ఇంతకు ముందు కూడా

    ఇంతకు ముందు కూడా

    ఇక ఇలా కార్తీక మాసంలో కోటి దీపాత్సవంకు రావటం పవన్ కు తొలిసారేం కాదు. క్రితం సంవత్సరం కూడా ఆయన హాజరయ్యారు. అప్పుడు కూడా ఇలాగే అభిమానులను, భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఆయన అభిమానులను ఆనందరిచే విషయం.

    English summary
    Pawan attended the 'Koti Deepothsavam'and did special pooja. He appreciated the channel's program that is propagating the culture and spirituality.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X