twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్నడంలో మళ్లీ ఎస్పీ బాలసుబ్రమణ్యమే

    By Srikanya
    |

    బెంగళూరు : ఈటీవీ కన్నడలో బుల్లితెర వీక్షకుల్ని ఉర్రూతలూగించిన 'ఎదెతుంబి హాడువెను' (మన పాడుతా తీయగా తరహా పోగ్రాం) కార్యక్రమం మళ్లీ మీముందుకు వస్తోంది. ఈటీవీ కన్నడ న్యూస్‌ఛానల్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఛానల్‌ ముఖ్యుడు ఆర్‌.సుబ్బానాయుడు బెంగళూరులో ప్రకటించారు. వీక్షకుల విన్నపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. చెవులారా నవ్య సంగీత ధ్వనులను ఆస్వాదించాలనే వారికి మరో పండుగే అన్నారు.

    Phenomenal Talent on E-TV: Yede Thumbi Haaduvenu hosted by S. P. Balasubrahmanyam

    బాలల్లో దాగిన గానమాధుర్యాన్ని వెలికితెచ్చే ఈ విశిష్ట కార్యక్రమం ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇందులో పాల్గొనాలంటే 9-12 ఏళ్ల వయస్సున్న బాలలు అర్హులు.

    ప్రతీ ఎపిసోడ్‌కు సంగీత, సినీ రంగానికి చెందిన ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఎంపిక ప్రక్రియ ఈనెల 17 నుంచి ప్రారంభిస్తారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో 17, 18 తేదీల్లో, మైసూరులో- 19, హాసన్‌లో 20, మంగళూరులో 21, దావణగెరెలో 22, హుబ్లి-ధార్వాడలో 23న ఎంపికను నిర్వహిస్తారు.

    Phenomenal Talent on E-TV: Yede Thumbi Haaduvenu hosted by S. P. Balasubrahmanyam

    ఇందులో పాల్గొనాలని ఆసక్తి ఉన్న బాలలు 9342456699 నెంబర్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం.. మీ నగరంలో ఏర్పాటయ్యే ఎంపిక ప్రక్రియలో పాల్గొని ఎంచక్కా మీ ప్రతిభను చాటుకోండి అంటున్నారు నిర్వాహకులు.

    English summary
    Ede Tumbi Hadidenu programme is great (Only in the age group 8-12). .... once again HATS OF to kids,E-TV Kannada on Sunday nights called “Yedhe Thumbi Hadideno” (a singing contest of sorts) Started again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X