twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ సుమ షార్ట్ ఫిలిం(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్: రెగ్యులర్ గా టీవీ చూసే వారిలో సుమ గురించి తెలియని వారుండరు. టీవీ యాంకర్ గా ఆమెదో అధ్యాయం. దూర దర్శన్ రోజల నుంచి ఇప్పుటి శాటిలైట్ విస్తరణ దాకా ఆమె పాత్ర చాలా పెద్దది. ఎన్నో సీరియల్స్ చేసినా, సినిమాల్లో నటించినా ఆమెకు యాంకర్ గానే పెద్ద పేరు. ఇప్పుడామె ఓ షార్ట్ ఫిలింతో మన ముందుకు వస్తోంది. అయితే షార్ట్ ఫిలిం ను ఆమె డైరక్ట్ చేయటం లేదు. కేవలం సమర్పకులురాలిగా ఉండబోతోందని సమాచారం.

    కె. సుమ రాజీవ్ క్రియేషన్స్ పై రూపొందుతున్న ఈ షార్ట్ ఫిలిం టైటిల్ సమ్మతమే. కోరుకొండ రేవంత్ డైరక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాజంలోని అమ్మాయి, అబ్బాయిలను పొట్రేట్ చేస్తూ ఈ షార్ట్ ఫిలిం సాగనుంది. ఓ కుర్రాడు ఓ అమ్మాయితో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే ఆమె అతన్ని మిస్ అండరస్టాండ్ చేసుకుంది. తర్వాత పరిణామాలు ఎక్కడికి దారితీసాయి. ఆ జర్ని వీరీద్దనీ ఎలా కలిపింది అనేది ఈ షార్ట్ ఫిలిం లో చక్కగా చెప్పారని చెప్తున్నారు. ఈ షార్ట్ ఫిలిం చాలా బాగా వచ్చిందని సుమ చెప్తోంది.

    ఆ షార్ట్ ఫిలిం మీకూ చూడాలని ఉంటే...చూడండి...

    సుమ కెరిర్...

    ఇరవై మూడేళ్ల కెరీర్‌... వేల కార్యక్రమాలూ, ధారావాహికలూ... ఇలా యాంకర్‌ సుమ గురించి చెప్పడం మొదలు పెడితే చిట్టా చాలా పెద్దదే! ఆ ప్రస్థానంలో హాస్యాన్నీ, నటననూ కలగలిపిన యాంకరింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అవార్డుల కంటే ఎంతో విలువైన ప్రముఖుల ప్రశంసలతో పాటూ, ప్రేక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంది సుమ.

    Short Film From Telugu TOP Female Anchor Suma

    సుమ మాట్లాడుతూ... నేను చేసిన 'అవాక్కయ్యారా' కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. 'పట్టుకుంటే పట్టు చీర' పెద్ద హిట్టయ్యింది. అది ఎనిమిదిన్నరేళ్లు చేశా. తరవాత 'మహిళలూ మహారాణులూ' గేమ్‌ షో చేశా. అది నాలుగొందల భాగాలు పూర్తయ్యాక 'స్టార్‌ మహిళ'గా మారింది. ప్రస్తుతం పదహారొందల ఎపిసోడ్లకు దగ్గరపడింది. మహిళల కోసం ఉద్దేశించిన డైలీ షో.. ఇన్ని ఎపిసోడ్‌లు పూర్తి చేసుకోవడం నాకు తెలిసి ఇదే ప్రథమం.

    నేను గడగడా మాట్లాడతానని మీకు తెలుసుగా! అదే దూకుడులో ఆరొందల ఆడియో విడుదల కార్యక్రమాలకు పని చేశా. నా కెరీర్‌లో మూడేళ్ల పాటు నోటికి విశ్రాంతే ఇవ్వలేదు. దాంతో గొంతుకి ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. వైద్యుల సలహా ఏంటంటే... మూణ్నెళ్లు గప్‌చుప్‌గా ఉండటం. పదిరోజులు మాట్లాడకుండా విశ్రాంతి తీసుకున్నా.

    కానీ నేను సైగలు చేస్తుంటే, ఇంట్లో వాళ్లూ సైగలు చేసేవారు. విసుగొచ్చి 'మీ నోరు బాగానే ఉందిగా' అని కోప్పడేదాన్ని. ప్రస్తుతం గొంతుకు సంబంధించి వ్యాయామాలు చేస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ... కార్యక్రమాలు చేస్తున్నా. ఇవన్నీ ఒకెత్తయితే కమల్‌హాసన్‌గారు 'ఈనాడు' ఆడియో విడుదలకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించడం మరొక ఎత్తు అంటూ ఆనందంగా చెప్పుకొచ్చింది.

    పెళ్లి...జీవితం..

    రాజీవ్‌తో ప్రేమ వ్యవహారం అమ్మకు చెబితే ఒప్పుకోలేదు. నాన్న ఏకంగా మాట్లాడటమే మానేశారు. నన్ను వారం పాటు ఎక్కడికీ పంపలేదు. అమ్మమ్మకి ఫోన్‌ చేసి సలహా అడిగారు. తను ఒప్పుకోవడంతో నాన్న మా పెళ్లి చేశారు. నేను అత్తారింటికి వెళుతుంటే మొదటిసారి నాన్న కళ్లలో నీళ్లు చూసి తట్టుకోలేకపోయా. ఈ మధ్యే ఆయన చనిపోయారు.

    ఇక, మా బాబు పుట్టిన మూణ్నెళ్లకు విజయవాడలోని ఓ లోకల్‌ ఛానల్‌లో యాంకరింగ్‌కు పిలిచారు. అప్పటి ఆర్థిక పరిస్థితిని బట్టి అది చేయడం తప్పనిసరి అయింది. బాలింతనైనా ఎండలో నెల రోజులు చేశా. కానీ నిర్మాత రూపాయి కూడా ఇవ్వలేదు. చాలా బాధపడ్డా. మానసికంగా కుంగిపోయా. అప్పట్నుంచి జాగ్రత్తగా ఉంటున్నా అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ సుమ.

    English summary
    Suma is all set to present a short film "Sammathame" under K Suma Rajeev creations. This short film is directed by Revanth Korukonda and it is based on present day girl & boy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X