» 

టీవీ కమెడియన్‌తో శృతి హాసన్ డ్యూయెట్ సాంగ్

Posted by:

ముంబై: కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తొలుత సింగర్ గానే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నటిగా మారి తన టాలెంటు నిరూపించుకుంది. నటిగా కొనసాగుతూనే సింగర్‌గా అప్పుడప్పుడు సినిమాలకు పాటలు సైతం పాడుతోంది. అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న 'రేస్ గుర్రం' చిత్రంలో ఓ పాట కూడా పాడింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శృతి హాసన్ హిందీ టీవీ కామెడీ షో 'కామెడీ నైట్స్ విత్ కపిల్' నటుడు కపిల్ శర్మతో కలిసి ఓ పాట పాడబోతున్నారట. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈ వెంటులో శృతి హాసన్, కపిల్ శర్మ కలిసారు. ఈ క్రమంలో సింగింగ్, మ్యూజిక్ పట్ల ఇద్దరి అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఓసాంగు పాడాలని నిర్ణయించుకున్నారట. సుఖ్విందర్ సింగ్ ఈ పాటను కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

శృతి హాసన్‌కు సంబంధించిన సినిమాల వివరాల్లోకి వెళితే....ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం 'రేస్ గుర్రం' షూటింగ్ ఇటీవలే పూర్తయింది. దీని తర్వాత ఆమె తన నెక్స్ హిందీ మూవీ ప్రాజెక్ట్స్ 'వెల్ కం బ్యాక్', 'గబ్బర్' చిత్రాల్లో నటించనుంది. కపిల్ శర్మ త్వరలో 'బ్యాంక్ చోర్' అనే చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Read more about: shruti hassan, kapil sharma, race gurram, శృతి హాసన్, కపిల్ శర్మ, రేస్ గుర్రం
English summary
It is well-known that Shruti Hassan started her career as singer first and later hogged the limelight as an actress in films. Of late, she seems to have decided to take both careers up simultaneously. It was recently reported that she has crooned song for Stylish Star Allu Arjun's Telugu movie Race Gurram.
Please Wait while comments are loading...