»   » సంక్రాంతికి మహేష్ బాబు సినిమా కూడా వస్తోంది!

సంక్రాంతికి మహేష్ బాబు సినిమా కూడా వస్తోంది!

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి అంటే టాలీవుడ్లో సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీసం ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతాయి. ఈసారి సంక్రాంతికి బాలయ్య నటించిన ‘డిక్టేటర్', జూ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో', నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాలతో పాటు శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా' కూడా విడుదలవుతున్నాయి.

అయితే మహేష్ బాబు అభిమానులు ఈ పండక్కి తమ హీరో సినిమా రావడం లేదని కాస్త వెలితో ఉన్నది వాస్తవం. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. సంక్రాంతికి మహేష్ బాబు సినిమా కూడా వస్తోంది. అయితే వెండి తెరపై కాదు... బుల్లి తెరపై. మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘శ్రీమంతుడు' సంక్రాంతికి జీతెలుగు ఛానల్ లో వేస్తున్నారు.మహేష్ బాబు సినిమా అంటే ఫ్యామిలీ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అందులో ఇటీవలే వచ్చిన హిట్ సినిమా ‘శ్రీమంతుడు' అంటే భారీ రెస్పాన్స్ రావడం ఖాయం. అందుకే మంచి టైమ్ చూసి టీవీలో వేస్తున్నారు. ఈ సినిమాకు భారీ టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.


సంక్రాంతికి... ఇతర పెద్ద సినిమాలు టీవీలో వచ్చినా టీఆర్పీ రేటింగుల్లో ‘శ్రీమంతుడు' సినిమాను మించే అవకాశం లేదని అంటున్నారు. మరో వైపు ఈ సినిమా టీవీ ప్రీమియర్ షో సందర్భంగా పలు కార్పొరేట్ సంస్థలు కూడా ప్రకటనలు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయట.

English summary
"Srimanthudu" is set for its TV premiere on Zee Telugu on sankranthi.
Please Wait while comments are loading...