twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: ‘మాటీవీ’ డీల్ విలువ అంతా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగులో అనతి కాలంలోనే పాపులర్ అయిన ‘మా టీవీ' దినదినాభివృద్ధి చెందుతూ తెలుగులో నెం.1 ఎంటర్టెన్మెంట్ నెట్వర్క్‌గా విస్తరించింది. మాటీవీ నెట్వర్కులో దాదాపు అరడజనుకుపైగా ఛానల్స్ ఉన్నాయి. తాజాగా మాటీవీని స్టార్ ఇండియా నెట్వర్క్ వారు సొంతం చేసుకున్నారు.

    ఇటీవల హైదరాబాద్ లో జరిగిన డీల్ లో స్టార్ గ్రూప్ యాజమాన్యం మా టీవీలోని వాటాను కొనుగోలు చేసింది. అయితే మార్కెట్ రేట్ ప్రకారం ఎంత మొత్తం వెచ్చించారనేది విలేకరులు ప్రశ్నించగా మీడియా సమావేశంలో ఎవరూ స్పదించలేదు. అనధికారిక సమాచారం ప్రకరాం దీని విలువ రూ. 2500 కోట్లు ఉంటుందని అంచనా.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    STAR India acquires MAA TV's broadcast business for Rs 2.5k cr?

    మాటీవీ రాకముందే తెలుగులో సన్ నెట్వర్క్ కు సంబంధించిన జెమినీ టీవీ అధిపత్యం కొనసాగేది. అయితే మాటీవీ రాకతో సీన్ మారింది. నెం.1 స్థానంలో మాటీవీ కొనసాగుతోంది. మా టీవీలో నిమ్మగడ్డ ప్రసాద్ కు 60శాతం వాటా, నాగార్జున, చిరంజీవిలకు 20శాతం వాటా చొప్పున ఉన్నాయి. ఈ డీల్ ద్వారా వీరికి భారీగా లాభాలు వచ్చాయని తెలుస్తోంది.

    ఎవరెవరికి ఎంతెంత వాటాలు, ఎవరి భాగం ఎంత విషయం ఇంకా బహిరంగపరచకపోయినప్పటికీ...ప్రపంచంలోనే అతి పెద్ద శాటిలైట్ ఛానెళ్ల గ్రూప్ అయినటువంటి స్టార్ నెట్ వర్క్ తో మాటీవి భాగస్వామ్యం కుదుర్చుకోవటం తెలుగు టీవి ఛానెళ్ పరిణాల్లో చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి.

    English summary
    STAR India, a unit of 21st Century Fox, has acquired the entire broadcast business of MAA Television Network Ltd for an undisclosed amount. Sources told Business Standard the deal size could be about Rs 2,500 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X