twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్రమ సంభందం లేదు, రాత్రిళ్లు మా ఇంటికి రావటం లేదు: టీవీ ఆర్టిస్ట్ ఫైర్, కంప్లైంట్

    By Srikanya
    |

    కొచ్చి: ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎవరో దానికి తమకు తెలిసిన వారికి ముడిపెట్టి ప్రచారం మొదలెడతారు. సోషల్ మీడియా జనం..అందులో నిజాలేమిటి..అసలు ఏం జరిగింది అనేది పట్టించుకోకుండా ఆ ప్రచారాన్ని పీక్స్ కి తీసుకువెళ్తారు. నిజాలు తెలిసేసరికి జరగవల్సిన డామేజ్ జరిగిపోతుంది. ఇప్పుడు మళయాళి టీవి ఆర్టిస్ట్ కు అదే జరిగింది.

    పూర్తి వివరాల్లోకి వెళితే.... మళయాళంలో పాపులర్ టీవి ఆర్టిస్ట్ లక్ష్మి ఇప్పుడో వివాదంలో ఇరుక్కున్నారు. ఎర్నాకులంలో ఉన్న ఆమె ఇంటికి తరుచూ ఓ సబ్ ఇన్సపెక్టర్ వచ్చి వెళ్తున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం మొదలైంది. ఆమె ఫోటో పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై సైబర్ సెల్ లో కంప్లైంట్ చేసారు.

    Sub Inspector serial actress controversy Actress files complaint against dragging her name

    రీసెంట్ గా జె ఎస్ షాజీ కుమార్ అనే సబ్ ఇన్సిపెక్టర్ ...ఓ సీరియల్ నటి ఇంటికి రాత్రిళ్లు వచ్చి వెల్తూండటం గమనించిన చుట్టు ప్రక్కల ఇళ్ల జనం అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని రాస్తున్నారు. ఈ విషయమై మీడియాలోనూ వార్త వచ్చింది. అయితే ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరనేది మాత్రం వాళ్లు ప్రస్దావించలేదు. దాంతో లక్ష్మి అనే సీరియల్ ఆర్టిస్ట్ పేరుని, పొటోని జత చేస్తూ వాట్సప్, ఫేస్ బుక్ లలో జనం ప్రచారం మొదలెట్టారని లక్ష్మి ఆరోపణ.

    ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...తన పై ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తు న్నారని, తన ఇమేజ్ ని భంగం కలిగిస్తున్నారని అన్నారు. అవసరంగా తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆమె వాపోయారు. తను అలాంటి దాన్ని కాదని అందరికీ తెలుసు అని, అయితే ఎందుకు ఇలా చేస్తున్నారనేది అర్దం కావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

    Sub Inspector serial actress controversy Actress files complaint against dragging her name

    ఇక ఈ విషయమై కేరళలోని సీరియల్ ఆర్టిస్ట్ అశోశియేషన్ సైతం చాలా కోపంగా ఉంది. దాని జనరల్ సెక్రటరీ ఆత్మ(పేరు) మాట్లాడుతూ... ప్రతీ చెత్త విషయంలోకి టీవి సీరియల్ ఆర్టిస్ట్ లను లాగటం భావ్యం కాదన్నారు. ఈ మధ్యకాలంలో టీవి ఆర్టిస్ట్ లను అనవసరమైన వివాదాల్లోకి డ్రాగ్ చేయటం రివాజుగా మారిందని , ఈ విషయమై తాము సీరియస్ గా తీసుకుని, ఇలా చేసేవారని వదలమని చెప్పారు.

    English summary
    There was a report went viral in social media that a Sub Inspector named Saji Kumar had caught by the people while he was visiting a lady’s home at Puthankurish, Ernakulam. People alleged that they caught him red handed while he was having an immoral relationship with a serial actress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X