twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదీ తెలివంటే...: పవన్ ని అడ్డం పెట్టి మిగతా రెండూ

    By Srikanya
    |

    హైదరాబాద్ : శాటిలైట్ బిజినెస్ చాలా గమ్ముత్తుగా జరుగుతూంటుంది. ఓ పెద్ద సినిమాని అడ్డం పెట్టి రెండు మూడు యావరేజ్ సినిమాలు ప్యాకేజ్ గా ఛానెల్స్ కు అంటగడుతూంటారు. క్రేజ్ ఉన్న పెద్ద సినిమా కోసం మిగతావి తీసుకుంటూండటం సాధారణంగా జరిగే విషయం. అందుకే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ శాటిలైట్ బిజినెస్ విషయంలో కంగారుపడరు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల చిత్రం శాటిలైట్ రైట్స్ ని అడ్డం పెట్టి...మరో రెండు సినిమాలను సురేష్ బాబు జెమినీ ఛానెల్ కు ప్యాకేజ్ గా అమ్మినట్లు టీవి సర్కిల్స్ లో వినపడుతోంది.

    అందిన సమాచారం ప్రకారం...పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన గోపాల గోపాల చిత్రం శాటిలైట్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ముఖ్యంగా అది యాక్షన్ చిత్రం కాకపోవటం, పవన్ కు, వెంకటేష్ కు ఉన్న క్రేజ్ ఈ ప్రాజెక్టుపై హైప్ క్రియేట్ చేసాయి. ఈ నేపధ్యంలో మిగతా ఛానెల్స్ అన్నీ పోటీ పడినా జెమినీకే ఈ రైట్స్ ఇచ్చారు. ఆ ప్యాకేజి ఇరవై కోట్లకు కుదిరినట్లు చెప్పుకుంటున్నారు. ఆ ప్యాకేజీలో భాగంగా సురేష్ బాబు బ్యానర్ నుంచి వచ్చిన గత చిత్రాలు దృశ్యం, భీమవరం బుల్లోడు లను కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

    గోపాల గోపాల విషయానికి వస్తే...

    Suresh Babu strikes gold with Gopala Gopala

    సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

    శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్ర్కీన్‌ప్లేను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.

    దర్శకుడు మాట్లాడుతూ...నిజం వేరు.. నమ్మకం వేరు. రెండింటి మధ్య స్పష్టమైన గీత ఉంది. భక్తి ఆ గీతను చెరిపేస్తుంది. నాస్తికులు మాత్రం అదే గీతను భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు. మనం నమ్మేవన్నీ నిజాలు కావు, దేవుడిపై మనకున్నది నమ్మకం కాదు, భయం అని మరో వాదన లేవదీశాడొకాయన. నలుగురి మధ్యో, నాలుగు గోడల లోపలో ఈ ప్రశ్న లేవనెత్తలేదు. ఏకంగా న్యాయస్థానంలోనే చర్చకు తెరలేపాడు. ఆ తరవాత ఏమైందో? ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చిందెవరో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కిషోర్‌ పార్థసాని (డాలీ). ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'.

    ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వెంకటేష్‌, శ్రియ తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ వారంలో పవన్‌ కల్యాణ్‌ చిత్ర బృందంతో కలుస్తారు. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ''బాలీవుడ్‌ చిత్రం 'ఓ మై గాడ్‌'కి రీమేక్‌ ఇది. వెంకటేష్‌, పవన్‌ పాత్రలు మనసుకు హత్తుకొంటాయ''ని యూనిట్ చెబుతోంది.

    సృష్టి లయలకు కారణం నేనే. సమస్త లోకాన్నీ నేనే నడిపిస్తున్నా.. అని కృష్ణుడు గీతోపదేశం చేశాడు కదా.. అయితే నా కష్టాలకూ ఆయనే బాధ్యుడు..'' అంటూ లాజిక్‌ తీశాడొకాయన. అక్కడితో ఆగలేదు. కోర్టు మెట్లెక్కాడు. న్యాయశాస్త్రంలోనూ ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. చివరికి ఆ కృష్ణుడే దిగి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కథెలా నడిచిందో తెలియాలంటే 'గోపాల గోపాల' చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రంలో 45 నిముషాలు మాత్రమే ఉంటుందని అన్నారు.

    చిత్రం కథ విషయానికి వస్తే..

    దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

    బిజినెస్ విషయానికి వస్తే...

    పవన్ కళ్యాణ్ కి నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బ్రద్దలు కొడుతూంటాయి. గబ్బర్ సింగ్ 17 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేస్తే, తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్ తాజా చిత్రం 'గోపాల గోపాల' కి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

    అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 'గోపాల గోపాల' నైజాం రైట్స్ ని 14 కోట్లకు అమ్ముడైంది. ప్రశాంత్ ఫిల్మ్ వారు ఈ ఏరియా పంపిణీ హక్కులు పొందారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం థియోటర్ వరకూ...55 కోట్లు చేసిందని ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నిర్మాత సురేష్ బాబు, శరద్ మరారా లు దాదాపు 20 కోట్లు వరకూ టేబుల్ ప్రాఫెట్ ని లబ్ది పొందుతున్నారని టాక్. ముఖ్యంగా పవన్ గత చిత్రం అత్తారింటికి దారేది కన్నా ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ కావటం కలిసి వచ్చే అంశం.

    అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు

    English summary
    Finally Gemini TV has bagged the Gopala Gopala rights for a record price. Producer Suresh Babu sold the satellite rights of Gopala Gopala along with his other two movies Drushyam and Bheemavaram Bullodu. Gemini TV reportedly paid 20 crore rupees for this package.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X