twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జబర్దస్త్ ‘వేణు’పై ...కేసు

    By Srikanya
    |

    హైదరాబాద్: ఫిల్మ్ నగర్‌లో కమెడియన్ వండర్స్ వేణుపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో వేణుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన స్నేహితులు చికిత్స నిమిత్తం వేణును అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఎవరు ఈ దాడి చేసారో, చేయించారో తెలియరాలేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరో ప్రక్క వేణు కు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇటీవల వేణు ఓ టీవీలో ప్రసారమైన కామెడీ షోలో గౌడ కులాన్ని కించపరిచేవిధంగా స్కిట్ చేయడంపై గౌడ సంఘం వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శ్రామిక గౌడ మహిళల జీవన విధానాన్ని అవమానపర్చిన జబర్దస్థ్ కార్యక్రమంపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

    పూర్తి వివరాల్లోకి వెళితే...

    Telugu TV actor Venu of Jabardasth fame attacked in Hyderabad

    ఈటీవీలో ప్రసారమౌతున్న ‘జబర్దస్త్' షో ఫేం వేణుపై గౌడ కులస్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు.

    దీంతో కిందపడిపోయిన వేణు వారి నుంచి తప్పించుకొని సమీపంలో ఉన్న ఫిలింనగర్ అవుట్‌పోస్ట్‌లో దూరాడు. గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వట్టికూట రామారావు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ విద్యార్థులు ఫిలించాంబర్ వద్దకు చేరుకున్నారు. వేణు ప్రదర్శించిన స్క్రిఫ్ట్ వల్ల కోటి మంది గౌడ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు.

    జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

    తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    English summary
    A small screen comedian was attacked by a group of persons belonging to Goud community at Film Nagar here for allegedly indulging in "offensive portrayal" of their caste in a comedy show, police said. "Comedian Venu was assaulted by members of a community, who accused him of offending their community and hurting their sentiments through his acts in a comedy show on a Telugu channel," ACP D Uday Kumar Reddy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X