»   » థ్యాంక్స్ అనసూయ.. సూపర్ ఫన్.. నిద్రపోను.. రానా

థ్యాంక్స్ అనసూయ.. సూపర్ ఫన్.. నిద్రపోను.. రానా

న్యూట్రల్‌గా ఉండటమే బెస్ట్ రొమాన్స్ అని యాంకర్ అనసూయకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా దగ్గుబాటి అన్నారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

న్యూట్రల్‌గా ఉండటమే బెస్ట్ రొమాన్స్ అని రానా దగ్గుబాటి అన్నారు. ఓ టెలివిజన్ కోసం యాంకర్ అనసూయ చేసిన ఇంటర్వ్యూలో ఘాజీ సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు పలు విషయాలను వెల్లడించారు. ఒక సన్నివేశానికి సంబంధించి నవరసాలను అద్భుతంగా పండించారు.

పీ ఇంటర్వ్యూ ఫన్‌గా ఉంది

ఇంటర్వ్యూలో చాలా బాగా సాగింది. చాలా ఫన్ గా ఉంది. బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ అనసూయ అంటూ ట్వీట్ చేశారు.

పెళ్లి ఎప్పుడు చేసుకొంటారని ప్రశ్నలు

నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత నా పెళ్లి గురించి అడుగుతున్నారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌లో నా గర్ల్‌ఫ్రెండ్ గురించి మీడియా అడుగుతుంటుంది. ఏదో చెప్పాలని ఓసారి నాకు హైదరాబాద్‌లో గర్ల్‌ఫ్రెండ్ ఉందని అబద్ధం చెప్పాను. అది ఎంత గందరగోళం సృష్టించిందో నాకు తెలుసు. అప్పటి నుంచి అబద్దాలు ఆడకూడదని నిర్ణయించుకొన్నాను.

సరిగా నిద్రపోను.. బాగా తింటాను

నేను సరిగా నిద్రపోను. కానీ ఎక్కువగా తింటాను. పార్టీలకు వెళ్లినా ప్రత్యేకంగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫ్రెండ్స్‌కు తెలియకుండా తినేసి వస్తాను. నిద్ర లేకపోయినా తిండి ఉంటే చాలు.

న్యూట్రల్‌గా ఉంటేనే బెస్ట్ రొమాన్స్

రొమాన్స్ అనేది మనసులోని ఉంటేనే అది చాలా బాగా ఉంటుంది. బయటపెడితే ఎవరో ఏదో అనుకొంటారు. ఏదో అవుతుంది. అందుకే న్యూట్రల్ గా ఉంటే అది బెస్ట్ రొమాన్స్ ఉంటుంది.

అల్లు అర్జున్, తారక్ అంటే చాలా ఇష్టం

ప్రస్తుతం ఉన్న హీరోల్లో తారక్, అల్లు అర్జున్ అంటే ఇష్టం. అల్లు అర్జున్ నాకు చాలా క్లోజ్. అతని ట్రాన్స్‌ఫార్మ్ చూస్తే చాలా ఇన్సిపేరేషన్‌గా ఉంటుంది. ఇటీవల ధ్రువ చూశాను. చాలా బాగా చేశాడు. డిఫరెంట్‌గా చేయడం నాకు బాగా నచ్చింది.

English summary
Rana says Best Romance is being Neutral. He answered with fun in Anchor Anasuya interview
Please Wait while comments are loading...