»   » జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

కమెడియన్ రమేష్ భార్య త్రిపురాంభిక ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ గాజువాకలోని శ్రీనగర్ కాలనీలో నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

విశాఖ: జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖలో చోటు చేసకుంది. కమెడియన్ పొట్టి రమేష్ భార్య త్రిపురాంభిక ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ గాజువాకలోని శ్రీనగర్ కాలనీలో నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

జబర్దస్త్ కార్యక్రమంతో పాటు భలే ఛాన్స్ లే లాంటి టీవీ షోల ద్వారా పాపులర్ అయిన రమేష్ గతేడాది డిసెంబర్ 12న త్రిపురాంబికను పెళ్లాడారు. త్రిపురాంబిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే రమేష్ విశాఖ చేరుకున్నారు.

తమ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో తెలియదని రమేష్ తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొట్టి రమేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

త్రిపురాంబిక తల్లి దండ్రుల ఆరోపణలు

త్రిపురాంబిక తల్లిదండ్రులు, బంధువులు విశాఖ కేజీహెచ్‌కు చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి శోకసముద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పెళ్లైన మరుసటిరోజు నుంచే అత్త, ఆడపడుచు వేధించే వారని వారు ఆరోపించారు.

తల్లి ఆరోపణ

త్రిపురాంబిక తల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ...మా అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరుపాలని, పోలీసులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

బెదిరింపు కాల్స్

ఈ ఘటనపై మహిళా సంఘం నేత ప్రభావతి మాట్లాడుతూ కేసులు పెట్టొద్దంటూ త్రిపురాంబిక కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు. ఈ కేసును పోలీసులు నిష్పాక్షింగా విచారణ జరపాలని కోరారు.

రమేష్ దిగ్భ్రాంతి

తమ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో తెలియదని రమేష్ తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొట్టి రమేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

English summary
TV comedian Ramesh’s wife has committed suicide on yesterday. Going into the details, Ramesh of Bhale Chance Le TV show fame married Tripurambika last year. She has committed suicide in her residency and the reason behind her this extreme decision is yet to be known.
Please Wait while comments are loading...