twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరీ ఛమ్మక్ చంద్ర? ఎక్కడివాడు? మోసగాడేనా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో టీవి చూసే చాలా మందికి పరిచయం అక్కర్లేని పేరు ఛమ్మక్ చంద్ర. అయితే ఆయన ఈ రోజు కొన్ని ఊహించని కారణాలతో వార్తలకు ఎక్కారు. స్వాతి నాయుడు అనే ఆమె ఛమ్మక్ చంద్రపై పచ్చి మోసగాడని, అమ్మాయిలను గెస్ట్ హౌస్ లకు పిలిపించుకుంటాని ఆరోపణలు చేసింది.

    ఆమె ఈ విషయాలని వివరిస్తూ వీడియో విడుదల చేసి సంచలనం రేపింది. తన గెస్ట్ హౌస్ లకు పిలిచి లైంగిక దాడులకు పాల్పడుతున్న చంద్ర..చాలా మంది ఆడవాళ్లని మోసం చేసాడని, వేషం ఇప్పిస్తానని వారిని ముగ్గులోకి దింపుతాడంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు..తన సెక్సవల్ అవసరం తీరాక వారిని పట్టించుకోడని అంది.

    స్వాతి నాయుడు ఫోటో గ్యాలరీ

    అంతేకాదు అతను ఆడవాళ్లను పిలిపించుకునే గెస్ట్ హౌస్ పేరు, ఎడ్రస్ తో సహా వివరించింది. చాలా మంది ఆడవాళ్లకు అతను అన్యాయం చేసాడని, అతని వెంటనే వారికి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవాలని వార్నింగ్ తరహాలో అతన్ని ఎడ్రస్ చేస్తూ చెప్పింది.

    ఈ నేపధ్యంలో అసలు ఛమ్మక్ చంద్ర ఏ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడు అనేది అందరిలో ఆసక్తికరమైన అంశమైంది.

    షాక్ అయ్యే...ఛమ్మక్ చంద్ర ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

    స్లైడ్ షోలో

    స్వగ్రామం...

    స్వగ్రామం...

    చంద్ర మాటల్లోనే.. "నా స్వగ్రామం నిజామాబాద్ జిల్లా గాంధారి మండలం వెంకటాపురం తండా. చదివింది పదోతరగతి. తల్లి తండ్లు దమున, ధన్ సింగ్

    పదవతరగతి తప్పాను

    పదవతరగతి తప్పాను

    భాన్సువాడలో ఏడవ తరగతి వరకూ చదివిన ఛమ్మక్ చంద్ర...ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎస్టీ వసతి గృహంలో ఎనిమిది, తొమ్మిది, పది చదివాడు. కానీ పది తప్పాడు.

    చిన్నప్పటి నుంచీ...

    చిన్నప్పటి నుంచీ...

    చిన్నప్పటి నుంచి కమెడియన్ కావాలన్నది నా కోరిక. మా ఊర్లో పెళ్లిళ్లు ఉన్నప్పుడు స్టేజిల మీద పాటలు పాడుతూ.. జోక్స్ చెబుతూ.. జనాన్ని ఎంటర్టైన్ చేసేవాడ్ని

    మా అమ్మ...

    మా అమ్మ...

    "మాది చాలా పేద కుటుంబం. కష్టపడి ఎదిగొచాను. మా అమ్మ 3 కిలోమీటర్లు తమ్ముడిని ఎత్తుకొని మిషన్ కుట్టడానికి రోజూ వెళ్ళేది.

    ఆ తర్వాత అంగనవాడి

    ఆ తర్వాత అంగనవాడి

    ఆ సమయంలో ఛమ్మక్ చంద్ర తల్లి జమునకు తండాలో అంగన్ వాడీ కార్యకర్తగా ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలోకూడా తిండికి చాలా ఇబ్బందులు పడ్డారు.

    మా నాన్న

    మా నాన్న

    నా తండ్రి సైకిల్ పై 12 కిలోమీటర్లు వెళ్లి కట్టెలను అమ్మేవాడు. ఇలా.. వారికొచే సంపాదనతోనే కుటుంబం అతి కష్టం మీద గడిచేది.

    పాలు అమ్మి మరీ..

    పాలు అమ్మి మరీ..

    మాకో ఆవు ఉండేది. పాలను అమ్మి, వచ్చిన డబులతో రోజూ బియ్యం కొనుక్కునే వారం. తమ్ముళ్లిద్దరూ వ్యవసాయం చేస్తారు.

    కూలిగా పనిచేసా..

    కూలిగా పనిచేసా..

    హైద్రాబాద్ వచ్చి బతుకు దెరువు కోసం ఒకవైపు కూలీగా పని చేస్తూనే సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించా.

    ఇంటికి పంపేవాడిని

    ఇంటికి పంపేవాడిని

    కూలీ డబులతో ఒక పూట భోజనం చేసి, ఖర్డులు పోగా మిగిలిన డబులను ఇంటికి పంపేవాడిని.

    యాక్టింగ్ స్కూల్లో

    యాక్టింగ్ స్కూల్లో

    చిన్నప్పటినుంచీ సినిమాలంటే పడి చచ్చేవాడు. హైదరాబాద్ లో సూపర్ స్టార్ యాక్టింగ్ స్కూల్ లో చేరాడు.

    పదేళ్లు

    పదేళ్లు

    మూడు నెలలు శిక్షణ తీసుకుని పదేళ్లపాటు అవకాశాల కోసం ట్రైల్స్ ..మరో ప్రక్కన కూలి పనులు.ఇదీ జీవితం

    ఆశలు వదలుకున్నాక

    ఆశలు వదలుకున్నాక

    తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమా తో తొలి అవకాసం ..ఆశలు వదులుకున్నాక వచ్చింది.

    మొదటి రెమ్యునేషన్

    మొదటి రెమ్యునేషన్

    ఆ సినిమాలో తొలి రెమ్యునేషన్ 500 తీసుకున్నాడు ఛమ్మక్ ఛంద్ర..అప్పట్లో అది అతి పెద్ద విజయం

    చిన్నా చితకా

    చిన్నా చితకా

    ఆ సినిమాతో బ్రేక్ రాలేదు. మరో పదేళ్లు చిన్నా చితకా వేషాలతో గెంటుకొచ్చాక జబర్దస్త్ తో ఎంట్రీ

    ఎక్కువ సంతోషం

    ఎక్కువ సంతోషం

    జబర్దస్ షోతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నా తల్లిదండ్రులు నా కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు" అని తెలిపాడు.

    సినిమాల్లోనూ

    సినిమాల్లోనూ

    ఛమ్మక్ చంద్ర ఇప్పుడు సినిమాల్లోనూ పాపులర్ కమిడయన్ అయ్యారు. 30 సినిమాల్లో నటించారు.

    పవన్ తోనూ

    పవన్ తోనూ

    పవన్ కళ్యాణ్ తోనూ సర్దార్ గబ్బర్ సింగ్ లో ఇప్పుడు నటిస్తున్నారు. అది పూర్తి ఆనందాన్ని ఇచ్చే అంశం.

    సొంతంగా సినిమా

    సొంతంగా సినిమా

    రీసెంట్ గా తన జబర్దస్త్ మిత్రులతో కలిసి హీరోలుగా సినిమా మొదలెట్టారు. అది అతి త్వరలో మొదలవబోతోంది.

    English summary
    jabardasth chammak chandra came from Vankatapur Tanda. Venkatapur is a Village in Gandhari Mandal in Nizamabad District of Telangana State.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X