twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గీతాంజలి': నిర్మాత ఒడ్డున పడ్డట్లే

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో చిన్న సినిమా తీయటం అనేది తెలుగులో పెద్ద సాహసమే. థియోటర్స్ నుంచీ, బిజినెస్, శాటిలైట్ ..ప్రతీ ఫేజ్ లోనూ సమస్యలే. అయితే కోన వెంకట్ వంటి సినీ సీనియర్ అండగా ఉండటంతో గీతాంజలి చిత్రానికి కొన్ని అడ్డంకులు తగ్గుతున్నాయి. తాజాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడవటంతో పెద్ద రిలీఫ్ వచ్చినట్లైంది. జీ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం నిర్మాత ఒడ్డున పడ్డట్టే అంటున్నారు. మిగతా బిజినెస్ కూడా జరిగితే ప్రాజెక్టు టేబుల్ ప్రాఫెట్ లో ఉంటుందంటున్నారు.

    దాదాపు కోటి రూపాయలుకు ఈ రైట్స్ అమ్ముడైపోయినట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్ లో హాట్ గా ఉన్న అంజలి హీరోయిన్ కావటం, బ్రహ్మానందం కీలకమైన పాత్ర చేయటం, శ్రీనివాస రెడ్డి మరో కీ రోల్ లో కనపడటం, కోన వెంకట్ పేరు ఈ రేటు తేవటానికి తోర్పడ్డాయి. దాంతో ఈ హర్రర్ కామెడీ చిత్రం నిర్మాతకు ధైర్యం వచ్చినట్లైంది. కొత్త దర్శకుడు చిత్రం అయినా, సినిమాలో హీరో లేకపోయినా ఈ రేటు పలకటం...కేవలం వచ్చిన క్రేజే కారణం అంటున్నారు.

    అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'గీతాంజలి'. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలో కనిపిస్తారు. రాజ్‌కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్‌ సమర్పకులు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. టైటిల్, అంజలి, కోన వెంకట్ కాంబినేషన్ తో ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వచ్చింది.

    Zee Telugu buys satellite rights of Geethanjali

    దర్శకుడు మాట్లాడుతూ ''ఎవరూ వూహించని కథ కథనాలతో రాబోతున్న చిత్రమిది. హారర్‌, వినోదం కలగలిపి ఉంటాయి. అంజలికి నటిగా మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది'' అన్నారు. అలాగే ఈ చిత్రంలో అంజలి రెండు పాత్రలను పోషిస్తోందని తెలుస్తోంది. కాలేజీకి వెళ్ళే అమ్మాయిగా, గృహిణిగా ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.

    కోన వెంకట్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించాలి. ఆయనకు వేరే కమిట్‌మెంట్స్ వుండటంతో ఈ సినిమా బాధ్యత నామీదపడింది. చాలా కాలంగా సినిమా చేయాలని ఎదురుచూస్తున్న ఎం.వి.వి. సత్యనారాయణకు ఈ చిత్రకథ నచ్చడంతో గీతాంజలి చిత్రాన్ని సైలెంట్‌గా ప్రారంభించాం. అంజలి లేకపోతే ఈ సినిమా లేదు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రహ్మానందం పాత్ర కీలకం అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... '' ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము''అన్నారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌రాణే, బ్రహ్మానందం, రావు రమేష్‌, మధునందన్‌, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి కళ: రఘు కులకర్ణి, కూర్పు: ఉపేంద్ర, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

    English summary
    The makers of Geethanjali heaved a huge sigh of relief after the satellite rights of the film were acquired by Zee Telugu for an undisclosed price. Buzz is that the channel bought the rights for 1 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X