బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారం తీవ్ర వివాదంంగా మారింది. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకొన్న తర్వాత ఆయన పెళ్లిపై హిందూ, ముస్లిం మత పెద్దలు సంచలన వ్యాఖ్యలు చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో ఆయన లవ్ జిహద్ పేరుతో హిందూ అమ్మాయిలను మాత మార్పిడికి పాల్పడుతున్నారు ఆరోపించారు. అయితే తాజాగా తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు సానుకూలంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన తన పెళ్లిపై వివరణ ఇస్తూ..
బాలీవుడ్ సినీ ప్రముఖులు రీనా దత్తా, కిరణ్ రావు చట్టబద్దంగా విడాకులు ఇచ్చిన తర్వాత నేను గౌరీని వివాహం చేసుకొన్నాను. కానీ ఆమె హిందూ మతానికి చెందిన వారు కాదు. ఆమె క్రిస్టియన్ మతానికి చెందిన వారు. అయినా ఆమె క్రిస్టియన్ మత ఆచారాలను పాటించడం లేదు అని అమీర్ ఖాన్ తెలిపారు.
లవ్ జిహద్‌కు పాల్పడ్డారని వస్తున్న విమర్శలను ఘాటుగా అమీర్ ఖాన్ తిప్పి కొట్టేందుకు ప్రయత్నించారు. నా ఇద్దరు సిస్టర్స్ కూడా హిందువులను పెళ్లి చేసుకొన్నారు. నా కూతురు కూడా హిందువునే వివాహం చేసుకొన్నారు. నా అల్లుడు మన్సూర్ క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొన్నారు అని ఆయన తెలిపారు. నేను చేసుకొన్న మూడు పెళ్లిళ్ల విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ముస్లిం మతానికి చెందినప్పటికీ.. నా భార్యలను బలవంతంగా మతం మార్చలేదు. మా పెళ్లి భారతీయ చట్టాల ప్రకారమే పెళ్లి జరిగింది అని అమీర్ ఖాన్ తెలిపారు. మా కుటుంబం, నా జీవితం మతానికి ఏ మాత్రం సంబంధం లేదు. మేమంత లౌకిక పరమైన ఆలోచన ఉన్న ఫ్యామిలీ అని ఆయన తెలిపారు. అమీర్ ఖాన్ మూడో పెళ్లి గురించి ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాకు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్పేన్ ఫత్వా జారీ చేశారు. ఇస్లాం బోధనల ప్రకారం.. ముస్లింమేతర మహిళను వివాహం చేసుకోవడం అనుమతించబోదు. ముస్లిం మతానికి చెందని వారిని పెళ్లి చేసుకోవడాన్ని షరియా చట్టం ఒప్పుకోదు. ఇస్లాం మతాన్ని కించపరచడమే అవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకొంటూ లవ్ జిహద్‌కు పాల్పడుతున్నారు. ఆయన చంపితే 5 కోట్లు రివార్డుగా ఇస్తాను. రివార్డు మాత్రమే కాదు.. ఈ కేసులో అయ్యే లీగల్ ఖర్చులన్నింటిని చెల్లిస్తాను అని స్వామి పరమహంస బాహాటంగా వార్నింగ్ ఇవ్వడం ఈ వివాదం మరింత తీవ్రంగా మారింది. అమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. అయితే ఆయన నిర్మించిన లాపతా లేడీస్, సితారే జమీన్ పర్ చిత్రం భారీ విజయాలు అందుకొన్నాయి. ఆయన తమిళంలో రజనీకాంత్‌తో కలిసి కూలీ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం 3 ఇడియట్స్, బట్వారా 1947 చిత్రాల్లో నటిస్తున్నారు.More Articles