బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు మూడో పెళ్లి వ్యవహారం చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నది. రీనాదత్తా, కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకొన్న తర్వాత బాలీవుడ్‌లో డిజైనర్ గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ చేసుకొని ఇటీవల మూడో వివాహం చేసుకోవడం తెలిసిందే. అయితే ముస్లిం మతానికి చెందిన వ్యక్తి హిందూ యువతిని ఎలా పెళ్లి చేసుకొంటారనే అంశంపై ముస్లిం మత పెద్దలు ఆగ్రహం చేశారు. ఇస్లాం మతానికి విరుద్ధంగా వివాహం చేసుకొన్నారంటూ ఆయనపై ఫత్వా జారీ చేయడం సంచలనం రేపింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా గౌరీ స్ప్రాట్‌తో అతి సన్నిహితంగా ఉంటున్న అమీర్ ఖాన్.. ఆరు నెలల డేటింగ్ తర్వాత జూలై 5వ తేదీన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో అతి నిరాడంబరంగా వివాహం చేసుకొన్నారు. ఈ వివాహానికి మొదటి భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావు కూడా తమ సంతానంతో హాజరయ్యారు. భారతీయ చట్టాల ప్రకారం వివాహం రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. పెద్దల సమీక్షంలో గౌరీని భార్యగా స్వీకరించినట్టు ఆయన ప్రకటించడంతో ఈ వివాహం తంతు ముగిసింది. ఇటీవలే ముంబైలోని విలాసవంతమైన ఇంటిలో కొత్త కాపురాన్ని వారు ప్రారంభించడం తెలిసిందే.
అయితే అంతా సవ్యంగా జరిగిపోతున్నదనుకొనే సమయంలో ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాకు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్పేన్ ఫత్వా జారీ చేశారు. ఇస్లాం బోధనల ప్రకారం.. ముస్లింమేతర మహిళను వివాహం చేసుకోవడం అనుమతించబోదు. ముస్లిం మతానికి చెందని వారిని పెళ్లి చేసుకోవడాన్ని షరియా చట్టం ఒప్పుకోదు. ఇస్లాం మతాన్ని కించపరచడమే అవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లాం బోధనలు, చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం వ్యక్తి వ్యవహరిస్తే షరియా కింద మహాపాపం. అలాంటి నిర్ణయాలు, చర్యలు షరియా, ఇస్లాం మనోభావాలను దెబ్బ తీస్తాయి. కాబట్టి ముస్లింలదరూ మత బోధనలను గౌరవించాలి. సమాజంపై దుష్ప్రభావం చూపే విధంగా నిర్ణయాలు తీసుకోవద్దు అని ఆయన పిలుపునిస్తూ.. జాతీయ మీడియా ఏబీపీతో మాట్లాడుతూ అమీర్ ఖాన్‌పై ఫత్వా జారీ చేశారు. అయితే ముస్లిం మత పెద్దలు జారీ చేసిన ఫత్వాపై అమీర్ ఖాన్ ఇంకా స్పందించలేదు. ఫత్వా జారీపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై మిస్టర్ పర్‌ఫెక్ట్ ఎలా స్పందిస్తారు? ఆయన వివరణ ఏమిటి? ఫత్వాను ఆయన వ్యతిరేకిస్తాడా? లేదా? అనేది అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా మారింది.More Articles