Lenin 14 Days Box Office: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'లెనిన్' సినిమా రెండో వారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లను రాబడుతున్నది. విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా, రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఆ అంచనాలను మించి వసూళ్లు రాబడుతోంది. అయితే 14వ రోజు దళపతి విజయ్ 'జన నాయగన్' విడుదల కావడంతో 'లెనిన్' కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం పడనుంది? ఇప్పటివరకు ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌కు ఇంకా ఎంత దూరంలో ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా నిర్మాణానికి సుమారు 55 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అఖిల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరిగినట్లు సమాచారం. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి లాభాల్లోకి వెళ్లాల్సి ఉంది.
అయితే 'లెనిన్' అంచనాలకు మించి ప్రదర్శన ఇచ్చింది. విడుదలైన మూడు నుంచి నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని ప్రధాన ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అఖిల్ కెరీర్‌లో తొలి భారీ కమర్షియల్ హిట్‌గా 'లెనిన్' నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా ద్వారా మంచి లాభాలు అందుకుంటున్నట్లు సమాచారం.
తొలి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ ఇక సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమాల కలెక్షన్లు తగ్గుతుంటాయి. కానీ 'లెనిన్' మాత్రం వీక్‌డేస్‌లోనూ మంచి స్థాయిలో వసూళ్లు సాధించింది. మొదటి సోమవారం (నాలుగో రోజు) 4.10 కోట్ల రూపాయల గ్రాస్, 3.60 కోట్ల రూపాయల నెట్, ఐదో రోజు 3. 42 కోట్ల రూపాయల గ్రాస్, నెట్ రాబట్టింది. ఇక ఆరో రోజు 2.45 కోట్ల రూపాయల గ్రాస్, ఏడో రోజు 2.28 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. మొదటి వారం ముగిసే సమయానికి లెనిన్ సినిమా 36. 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ దిశగా వేగంగా దూసుకెళ్లి, చాలా ఏరియాల్లో లాభాల్లోకి ప్రవేశించింది. రెండో వారంలోనూ తగ్గని జోరు ఇందులో తెలుగు వెర్షన్ నుంచే 46 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 'లెనిన్' సినిమా మొత్తం 63.71 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 53.06 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీర్ లో 10. 65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ఇలా మొత్తం కలిపి 63.71కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్త గ్రాస్ నమోదు చేసింది. 14వ రోజు అంచనా కలెక్షన్లు.. 'జన నాయగన్' ఎఫెక్ట్ పడేనా? అయితే ఇదే సమయంలో దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' భారీ స్థాయిలో విడుదల కావడంతో, 'లెనిన్'కు స్క్రీన్లు తగ్గే అవకాశం ఉంది. దీంతో 14వ రోజు నుంచి కలెక్షన్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన 'లెనిన్' లాభాల బాటలోనే కొనసాగుతోంది.
విడుదలైన మొదటి రోజు నుంచే లెనిన్ సినిమా 8.22 కోట్ల రూపాయల గ్రాస్, 7.15 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు నమోదు చేసింది. అఖిల్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్‌లలో ఒకటిగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండో రోజు (శనివారం) సినిమా మరింత జోరు చూపించింది. ఆ రోజు 10.18 కోట్ల రూపాయల గ్రాస్, 8.85 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. మూడో రోజు ఈ జోరు మరింత పెరిగి 11.39 కోట్ల రూపాయల గ్రాస్, 9. 90 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. వీకెండ్ ముగిసే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించిందట.
8 వ రోజు 1. 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, 9వ రోజు 2. 76 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఆదివారం (10 రోజు) మరోసారి పుంజుకుని 3. 34 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 11వ రోజు 1.20 కోట్ల రూపాయల గ్రాస్,12 వ రోజు 96 లక్షల రూపాయల గ్రాస్, 13 రోజు 77 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో 13 రోజులు ముగిసే నాటికి ఈ సినిమా 46. 27 కోట్ల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్లు నమోదు చేసింది.
'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. 14వ రోజు దేశవ్యాప్తంగా 887 షోలలో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా సుమారు 60 కోట్ల రూపాయాల నుంచి 80 కోట్ల రూపాయాల నెట్ వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.48 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ రూ.55 కోట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.65 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.More Articles