యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించారు. సహ నిర్మాతగా ధీరజ్ మొగిలినేని వ్యవహరించారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: మణిశర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రవి నంబూరి, కథ: సాయి రాజేశ్, సినిమాటోగ్రఫి: విశ్వాస్ డేనియల్, ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్, లిరిక్స్: అనంత శ్రీరాం తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఓవర్సీస్‌లో ఈ మూవీ వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 15 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర వాల్యూ కట్టడం జరిగింది. ఓవర్సీస్ రైట్స్‌ను 5 కోట్లుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా దాదాపు 35 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 15 కోట్ల రూపాయల షేర్, 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేట్రికల్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్‌లో చెన్నై లవ్ స్టోరీ చిత్రం 5 కోట్ల షేర్, 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాపై క్రేజ్ ఉండటంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. అయితే జన నాయగన్ సినిమాతో పోటీపడుతూ రిలీజైన ఈ చిత్రం తాజాగా థియేటర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకొంటూ పోతున్నది. జన నాయగన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు తుడిచిపెట్టుకుపోవడంతో ఆ థియేటర్ల స్థానంలో ఈ సినిమాను రిప్లేస్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నార్త్ అమెరికా అంటే యూఎస్ఏ, కెనడాలో ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కుతున్నది. ప్రీమియర్లతో కలిపి ఈ చిత్రం గత రెండు రోజుల్లో 300K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 3 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఆదివారం సెలవు దినం రోజున ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ చిత్రం రానున్న రోజుల్లో భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నార్త్ అమెరికాతోపాటు ఈ సినిమా ఇతర దేశాల్లో కూడా ఆదరణను సొంతం చేసుకొంటున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు నార్త్ అమెరికాతో కలిపి 5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో కిరణ్ అబ్బవరం సినిమాలకు ఉన్న ఫాలోయింగ్‌ను మరోసారి చెప్పింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.More Articles