యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, తెలుగు అమ్మాయి శ్రీగౌరీ ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యువత నుంచి రెస్పాన్స్ అదిరిపోతోంది. హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో మూడో రోజు చెన్నై లవ్ స్టోరీ వరల్డ్ వైడ్‌గా ఎంత వసూలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
చెన్నై లవ్ స్టోరీ బడ్జెట్
చెన్నై లవ్ స్టోరీని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌లు నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికంతో కలిపి ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. చెన్నై లవ్ స్టోరీ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 15 కోట్ల రూపాయల షేర్.. 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ష్స్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.
చెన్నై లవ్ స్టోరీ ఓవర్సీస్ కలెక్షన్స్ చెన్నై లవ్ స్టోరీ మూడో రోజు వసూళ్ల అంచనా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం చెన్నై లవ్ స్టోరీకి ఇండియాలో మూడో రోజు 2.64 కోట్ల రూపాయల నెట్ వసూలైంది. ఆదివారం కిరణ్ అబ్బవరం మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 1.50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 10 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో చెన్నై లవ్ స్టోరీ మూవీ మూడు రోజుల నాటికి 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 15 కోట్ల రూపాయలు షేర్.. 30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాల్సి ఉండగా వీకెండ్ నాటికి చెన్నై లవ్ స్టోరీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి కిరణ్ అబ్బవరం ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్స్
కిరణ్ అబ్బవరం మూవీకి తొలిరోజున 4.95 కోట్ల రూపాయలు, రెండో రోజున 5.50 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 10.45 కోట్ల రూపాయల నెట్.. 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 10.65 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.20 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 13 లక్షల రూపాయలు చొప్పున రాబట్టింది.
చెన్నై లవ్ స్టోరీ మూవీ నార్త్ అమెరికాలో 325K డాలర్లు (3.13 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో కిరణ్ అబ్బవరం మూవీ 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన కలెక్షన్స్‌తో కలిపి చెన్నై లవ్ స్టోరీ మూవీకి 2 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 16.62 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ డేటా చెబుతోంది. అయితే తమ చిత్రం రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 25.2 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అధికారికంగా ప్రకటించారు.
జన నాయగన్ వంటి భారీ చిత్రం థియేటర్లలో ఉన్నప్పటికీ చెన్నై లవ్ స్టోరీ బుకింగ్స్, వసూళ్ల విషయంలో జోరు చూపిస్తోంది. ఆదివారం కావడంతో ఉదయం నుంచే థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్స్‌లో సందడి చేస్తున్నారు. మూడో రోజు సాయంత్రం 4 గంటల వరకు చెన్నై లవ్ స్టోరీ మూవీకి ఇండియాలో 938 షోలు ప్రదర్శితమై 52 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.More Articles