బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో దండయాత్ర చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన సినిమా ధమాల్ 4. బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ధమాల్, డబుల్ ధమాల్, టోటల్ ధమాల్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ఇంద్రకుమార్ తెరకెక్కించారు. టీ- సిరీస్ ఫిల్మ్స్, మారుతి ఇంటర్నేషనల్, దేవగణ్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్లపై గుల్షన్ కుమార్, అజయ్ దేవగణ్, అశోక్ థాకారియా, ఇంద్రకుమార్, ఆనంద్ పండిట్ తదితరులు ఈ సినిమాను నిర్మించారు. జూలై 10న వరల్డ్ వైడ్‌గా ధమాల్ 4 విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ధమాల్ 4 వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు వసూలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
ధమాల్ 4 తారాగణం
ధమాల్ 4లో రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావెద్ జాఫ్రీ, రవి కిషన్, సంజయ్ మిశ్రా, ఉపేంద్ర లిమాయే, అంజలి ఆనంద్, సంజీదా షేక్, ఈషా గుప్తా, విజయ్ పట్కార్ తదితరులు నటించారు. సంజయ్ శుక్లా ఎడిటింగ్, సుధీర్ కుమార్ చౌదరి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. తన్సిక్ బాగ్చి, ఆదిత్య దేవ్, నీల్ కమల్ సింగ్ తదితరులు సంగీతం అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ధమాల్ 4ని 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ధమాల్ 4 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ధమాల్ 4 తొలిరోజు కలెక్షన్స్ అంచనా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో 970 షోలు, ముంబైలో 820 షోలు, అహ్మదాబాద్‌లో 600 షోలు, పూణేలో 370 షోలు, సూరత్‌లో 235 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లుగా తెలుస్తోంది. తొలిరోజున ఇప్పటి వరకు ధమాల్ 4 మూవీకి ఇండియాలో 5.10 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. శుక్రవారం అజయ్ దేవగణ్ మూవీ ఇండియాలో 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ధమాల్ సిరీస్ ట్రాక్ రికార్డ్, అజయ్ దేవగణ్ క్రేజ్, భారీ తారాగణం నేపథ్యంలో ధమాల్ 4కి అడ్వాన్స్ బుకింగ్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. మహారాష్ట్రలో 1.28 కోట్ల రూపాయలు, ఢిల్లీలో 86 లక్షల రూపాయలు, గుజరాత్‌లో 68 లక్షల రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో 46 లక్షల రూపాయలు, కర్ణాటకలో 33 లక్షల రూపాయలు, తెలంగాణలో 28 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షల రూపాయలు, తమిళనాడులో 8 లక్షల రూపాయలు, కేరళలో లక్ష రూపాయలు చొప్పున అడ్వాన్స్ బుకింగ్‌లో ఇండియా వైడ్‌గా 5.51 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
అడ్వెంచర్ కామెడీ సినిమాలకు హిందీ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. దీనికి తగినట్లుగానే ధమాల్ 4 మూవీకి మార్నింగ్ షో నుంచి మంచి బుకింగ్స్ నమోదైనట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. తొలిరోజు సాయంత్రం 5 గంటల వరకు ధమాల్ 4కి ఇండియా వైడ్‌గా 7120 షోలు ప్రదర్శితమై 16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది.More Articles