తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ నటించి చివరి సినిమా జన నాయగన్. ఎన్నో వివాదాలు, లీగల్ ఇబ్బందులు, సెన్సార్ సమస్యలను దాటుకుని 7 నెలలు ఆలస్యంగా జూలై 23న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. జన నాయగన్ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, సునీల్ తదితరులు కీలకపాత్ర పోషించారు. విజయ్‌కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను ఇక్కడ జన నాయకుడిగా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జన నాయకుడు తొలిరోజున ఆంధ్రా, నైజాంలలో ఎంత వసూలు చేసింది? అంచనాలను అందుకున్నదా లేదా? అనేది పరిశీలిస్తే..
జన నాయగన్ బడ్జెట్
దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. విజయ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 240 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. జన నాయగన్ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 245 కోట్ల రూపాయల షేర్.. 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. జన నాయగన్ మూవీ థియేట్రికల్ రైట్స్ ఆంధ్రా, నైజాంలలో 14 కోట్ల రూపాయలు పలికాయి. దాంతో ఈ సినిమా ఇక్కడ లాభాల్లోకి రావాలంటే దాదాపు 30 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
ఇండియాలో జన నాయగన్ తొలిరోజు కలెక్షన్స్ జన నాయగన్ ఓవర్సీస్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో జన నాయగన్ కలెక్షన్స్
జన నాయగన్‌కు తొలిరోజున ఇండియా వైడ్‌గా 41 కోట్ల రూపాయల నెట్.. 48.27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది. తొలిరోజున ఇండియా వైడ్‌గా 8711 షోలు ప్రదర్శితమై. 1655.9K టికెట్లు అమ్ముడైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇండియా వైడ్‌గా ఏకంగా 2470 షోలు హౌస్‌ఫుల్ అయినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. జన నాయగన్‌కు తొలిరోజున తమిళనాడులో 19.06 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 10.31 కోట్ల రూపాయలు, కేరళలో 4.86 కోట్ల రూపాయలు, మహారాష్ట్రలో 78.82 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.78 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో జన నాయగన్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలోని 353 సెంటర్స్‌కు గాను 213K డాలర్లు (2.05 కోట్ల రూపాయలు) రాబట్టింది. అలాగే యూకేలో 142K పౌండ్లు (1.8 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. యూరప్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, గల్ఫ్ మిడిల్ ఈస్ట్ దేశాలలో కలిపి జన నాయగన్ తొలిరోజున ఓవర్సీస్‌లో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భారత్‌లో వచ్చిన కలెక్షన్స్‌తో కలిపి దళపతి విజయ్ మూవీ వరల్డ్ వైడ్‌గా తొలిరోజున 78.27 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది.
జన నాయగన్ తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేకపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. తొలిరోజున ఆంధ్రా, నైజాంలలో కలిపి విజయ్ మూవీకి కేవలం 2.75 కోట్ల రూపాయలు మాత్రమే వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు. విజయ్ చివరి సినిమాగా హడావుడి చేసినప్పటికీ ఆయన లాస్ట్ మూవీ ది గోట్ కలెక్షన్స్‌ను జన నాయగన్ అధిగమించలేకపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ది గోట్ మూవీ తెలుగు వెర్షన్‌లో తొలిరోజున 3 కోట్ల రూపాయలకు పైగా నికర వసూళ్లను రాబట్టింది. అయితే వీకెండ్‌లో ఖచ్చితంగా జన నాయగన్ జోరు చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.More Articles