తమిళనాడు సీఎం, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి ప్రధాన పాత్రల్లో తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ఈ చిత్రం తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనే వివరాల్లోకి వెళితే..
భగవంత్ కేసరి సినిమా ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి తమిళ నేటివిటికి అనుగుణంగా భారీ మార్పులు చేపట్టారు. ఈ మూవీని సుమారుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ కమీషన్ బేస్ మీద ఇతర డిస్టిబ్యూటర్ల ద్వారా సొంతంగా రిలీజ్ చేసుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేశారు. దాదాపు ఈ చిత్రం 700 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. జన నాయగన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ బాక్సాఫీస్ వద్ద కనిపించింది. ఈ చిత్రం తమిళనాడులో 16.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 8.5 కోట్ల రూపాయలు, కేరళలో 3.5 కోట్ల రూపాయలు, తెలంగాణలో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 1 కోటి రూపాయలు, ఇతర రాస్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. మొత్తంగా 33 కోట్ల రూపాయలు ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్‌లో 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 59 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఇక ఈ సినిమా తొలి రోజు తమిళనాడులో భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ.. దళపతి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తున్నది. దాంతో తొలి రోజు భారీ కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజు తమిళనాడులో 40 నుంచి 45 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. అలాగే కర్ణాటకలో ఈ సినిమాకు 1000 కి పైగా షోనలను ప్రదర్శించారు. దాంతో ఈ చిత్రం మొదటి రోజు 14 నుంచి 15 కోట్లు వసూలు చేస్తుంది. కేరళలో 5 కోట్ల రూపాయలు, తెలంగాణ, ఆంధ్రాలో ఈ సినిమా 4 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రానికి మలేషియా, సింగపూర్, యూఏఈ దేశాల్లో భారీగా బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాడ్, ఇతర దేశాలతో కలిపి ఈ చిత్రం 30 నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నైట్ షోలకు స్పందన భారీగా ఉంటే ఈ రేంజ్ పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. జన నాయగన్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో 70 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. ఓవర్సీస్‌లో 30 నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 100 కోట్ల రూపాయల రాబట్టే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.More Articles