తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.

Advertisement

ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించారు. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత? ఈ చిత్రం తొలి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనే వివరాల్లోకి వెళితే..

Advertisement

విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా భావిస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన కనిపిస్తున్నది. ఇప్పటీకే ఈ సినిమా పైరసీకి గురై సినిమా మొత్తం సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ చిత్రానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్‌లో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని 26 రాష్ట్రాల్లో, 450 లొకేషన్లలో 1700 స్క్రీన్లలో 80 వేల షోలను దేశవ్యాప్తంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తమిళనాడులో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరుగుతున్నది. చెన్నైలో ఇప్పటికే ఈ సినిమాకు 4 కోట్ల రూపాయలు మేర అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. 90 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నది. ప్రస్తుతం అత్యధికంగా వసూలు చేసిన టాప్ 10 సినిమాల్లో ఒకటిగా మారింది. ఈ చిత్రం చెన్నైలో 10 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలో ఈ సినిమా పరాశక్తి అడ్వాన్స్ బుకింగ్‌ను బ్రేక్ చేసింది.

Advertisement

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ చిత్రాన్ని దిల్ రాజుకు చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ డిస్టిబ్యూషన్ చేస్తున్నది. ఈ సినిమాను ఆంధ్రా, నైజాంలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 1.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేసింది. మొత్తంగా 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

కర్ణాటకలో జన నాయగన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ రికార్డు స్థాయిలో సాగుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే బెంగళూరు సిటీలో 7 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి సంబంధించి 1000 షోలకుపైగా ప్రదర్శిస్తున్నారు.

Advertisement

ఓవర్సీస్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలో 300K డాలర్లు వసూలు చేసింది. తొలి రోజు ముగిసే సమయానికి 700K డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా 50 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతుంది.

Advertisement

ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. తమిళనాడులో 30 కోట్ల రూపాయలు, కర్నాటకలో 10 కోట్ల రూపాయలు, కేరళలో 4 కోట్ల రూపాయలు, ఏపీ, తెలంగాణలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 35 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియాలో 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఓవరాల్‌గా 90 నుంచి 100 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.