తమిళనాడు సీఎం, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.

Advertisement

ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి ప్రధాన పాత్రల్లో తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రానికి కర్ణాటకలో విపరీతమైన క్రేజ్ కనిపిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం కర్ణాటక థియేట్రికల్ రైట్స్ వాల్యూ ఎంత? ఈ మూవీ గత 3 రోజుల్లో ఎంత వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

Advertisement

విజయ్ చివరి చిత్రం కావడంతో జన నాయగన్‌ను భారీ బడ్జెట్‌తో మాస్ ఆడియెన్స్ పల్స్‌కు తగినట్టుగా ఈ సినిమాను 500 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 105 కోట్లతో సహా మొత్తం 200 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ చేశారు. దాంతో 210 కోట్ల షేర్, 420 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Advertisement

కన్నడలో ఈ సినిమాకు సంబంధించి తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. కానీ తమిళ భాష వెర్షన్‌కు భారీ ఆదరణ దక్కింది. కేవలం బెంగళూరులోనే ఈ సినిమా తొలి రోజు 1500 లకుపైగా షోలు ప్రదర్శించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 8 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా కన్నడలో అత్యధిక కలెక్షన్లు సాధించిన 10 టాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

జన నాయగన్ చిత్రం గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..తొలి రోజు 11.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.25 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 19.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడు రోజుల్లోనే దాదాపు 50 శాతం రికవరీని సాధించింది. రానున్న రోజుల్లో మిగిలిన 50 శాతం రివకరీ చేస్తుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

ఇక ఈ సినిమా 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆదివారం సెలవు దినం కావడంతో గత మూడు రోజుల కంటే ఎక్కువగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా నాలుగో రోజు 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఈ సినిమా సుమారుగా 25 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

జన నాయగన్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఇప్పటి వరకు ఇండియాలో 108.5 కోట్ల గ్రాస్, 92.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 63.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈ చిత్రం 172 కోట్ల రూపాయలు వసూలు చేసింది.