తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వివాదాలు, సెన్సార్ సమస్యలను దాటుకుని 7 నెలలు ఆలస్యంగా జూలై 23న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. మొదటి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న జన నాయగన్.. విజయ్ క్రేజ్ కారణంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో జన నాయగన్ నాలుగో రోజు వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
జన నాయగన్ బడ్జెట్
జన నాయగన్ మూవీని 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇందులో ఒక్క విజయ్ రెమ్యునరేషన్ 200 కోట్ల రూపాయల పైమాటే. తద్వారా భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో టాప్‌లో నిలిచారు విజయ్. జన నాయగన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల రూపాయల షేర్.. 420 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని వాల్యూ నిర్దేశించారు.
జన నాయగన్ 3 రోజుల కలెక్షన్స్ జన నాయగన్ ఓవర్సీస్ కలెక్షన్స్ జన నాయగన్ నాలుగో రోజు వసూళ్ల అంచనా నాలుగో రోజు సాయంత్రం 4 గంటల వరకు జన నాయగన్‌కు ఇండియాలో 6836 షోలు ప్రదర్శితమై 44 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఇప్పటికే టికెట్లు అమ్ముడైపోయాయంటే విజయ్ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అందుతున్న సమచారం ప్రకారం జన నాయగన్ మూవీకి 17.51 కోట్ల రూపాయల నెట్ వసూలైంది. నాలుగో రోజు దళపతి విజయ్ మూవీకి తమిళనాడులో 12 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు చొప్పున 30 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో జన నాయగన్ మూవీ 4 రోజుల్లోనే 200 కోట్ల రూపాయల మైలురాయిని చేరుకోనుంది.
భారీ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించిన జన నాయగన్.. తొలిరోజున 42.70 కోట్ల రూపాయలు, రెండో రోజున 21.15 కోట్ల రూపాయలు, మూడో రోజున 28.50 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో మూడు రోజుల్లో 92.35 కోట్ల రూపాయల నెట్.. 108.34 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు తమిళనాడులో 46 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 19.5 కోట్ల రూపాయలు, హిందీలో 10 కోట్ల రూపాయలు, కేరళలో 8 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది.
జన నాయగన్ ఓవర్సీస్‌లో తొలిరోజున 30 కోట్ల రూపాయలు, రెండో రోజున 7.50 కోట్ల రూపాయలు, మూడో రోజున 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడు రోజుల వరకు నార్త్ అమెరికా, యూకే, సింగపూర్, మలేషియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో కలిపి 63.50 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్‌లో వచ్చిన గ్రాస్‌తో కలిపి జన నాయగన్ వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో 171.84 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది.
మిక్స్‌డ్ టాక్, నెగిటివ్ రివ్యూలు చుట్టుముడుతున్నప్పటికీ విజయ్ స్టార్ పవర్ కారణంగా జన నాయగన్ దూసుకెళ్తోంది. ముఖ్యంగా విజయ్ సొంత రాష్ట్రం తమిళనాడులో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తమ అభిమాన నటుడి చివరి సినిమా కావడంతో తమిళులు కుటుంబాలతో కలిసి ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.More Articles