తమిళనాడు సీఎం, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి ప్రధాన పాత్రల్లో తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా థియేట్రికల్ వాల్యూ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో కర్ణాటకలో ఉత్తరాది రాష్ట్రాల్లో కేరళలో బాక్సాఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్‌లో ఎంతంటే? ఇక 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడు మినహాయిస్తే.. ఇతర ప్రాంతాల్లో ఈ మూవీ కలెక్షన్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం.. 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈవెనింగ్, నైట్ షోల తర్వాత ఈ చిత్రం సుమారుగా 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకల 60 లక్షల రూపాయలు, కేరళలో 30 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. థియేట్రికల్ వాల్యూ ప్రకారం అంటే ( 220 కోట్ల రూపాయల షేర్.. 420 కోట్ల గ్రాస్).. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద ఇంకా భారీగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడులో జన నాయగన్ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం త్వరలోనే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా 93 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 50 కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళనాడు తర్వాత ఇండియాలో ఈ సినిమా కర్ణాటకలోనే రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 75 శాతానికిపైగా రికవరీ సాధించింది అని తెలిపారు.
విజయ్ నటించిన ఈ సినిమా నార్త్ ఇండియాలో ముఖ్యంగా జన నేత పేరుతో విడుదలైన హిందీ వెర్షన్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రం ఉత్తరాది ఏరియాలో 15 కోట్ల రూపాయల గ్రాస్, 12 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇదే ఊపును కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది.
కేరళలో విజయ్ క్రేజ్‌కు తగినట్టుగా జన నాయగన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. ఈ చిత్రం గత 5 రోజుల్లో 14 కోట్ల రూపాయల గ్రాస్, 6.5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 8 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం రికవరీ సాధించింది. త్వరలోనే ఈ చిత్రం మలయాళంలో లాభాల బాట పట్టాల్సి ఉంటుంది.
జన నాయగన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా భగవంత్ కేసరి సినిమాకు ఫ్రీ మేక్ కావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపలేకపోతున్నారనే అభిప్రాయం కలుగుతున్నది. ఈ చిత్రం గత 5 రోజుల్లో 11.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రాలో 5.25 కోట్లు, నైజాంలో 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ వాల్యూ 11 కోట్ల రూపాయలు కాగా, ఇప్పటి వరకు ఈ సినిమా 5.5 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసింది. అంటే ఈ సినిమా నష్టాల నుంచి బయటపడాలంటే ఇంకా 11 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు మధ్యస్తంగా స్పందన కనిపిస్తున్నది. నార్త్ అమెరికాలో పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. కానీ మలేషియా, సింగపూర్‌లో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. అయితే తొలి వారాంతం తర్వాత ఈ సినిమా కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 8 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు 73 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.More Articles