కోలీవుడ్ సూపర్‌స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో అవాంతరాలను దాటుకుని జూలై 23న విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ విజయ్ స్టార్ పవర్‌తో తన భుజాన మోస్తున్నారు. ఫస్ట్ వీకెండ్‌లోనే ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్చపరుస్తోంది. అటు హిందీలో ఊహించని విధంగా కలెక్షన్స్ వసూలు చేస్తున్నాడు జన నాయగన్. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు హిందీలో జన నాయగన్ ఎంత వసూలు చేసిందో పరిశీలిస్తే..
జన నాయగన్ బడ్జెట్
జన నాయగన్ మూవీని 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. దళపతి విజయ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల రూపాయల షేర్.. 420 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.
జన నాయగన్ హిందీ బ్రేక్ఈవెన్ జన నాయగన్ హిందీ కలెక్షన్స్ అయితే దళపతి విజయ్ మూవీ ఓవరాల్‌గా హిందీలో బ్రేక్ఈవెన్ కావాలంటే 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉంది. జననేత జోరు చూస్తుంటే తొలివారం ముగిసేనాటికి క్లీన్ హిట్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్‌లో తన హవా చూపించిన జననేత.. మండే టెస్ట్‌లో తడబడ్డాడు. సోమవారం ఈ సినిమాకు వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. అయితే కోటీ 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం. జన నాయగన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
జన నాయగన్ మూవీని హిందీలో జననేత పేరుతో విడుదల చేశారు. జియో స్టూడియోస్ సంస్థ ఈ మూవీని నార్త్ ఇండియాలో విడుదల చేసింది. జన నాగయన్ హిందీ థియేట్రికల్ రైట్స్ 4.5 కోట్ల రూపాయల మేర అమ్ముడవ్వగా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 5 కోట్ల రూపాయల షేర్... 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
జననేతకు హిందీలో తొలిరోజున 2.55 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.74 కోట్ల రూపాయలు, మూడో రోజున 3.46 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 4.23 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.70 కోట్ల రూపాయలు చొప్పున 14.68 కోట్ల రూపాయల గ్రాస్.. 12.11 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్ షేర్ పరంగా 6.63 కోట్ల రూపాయలు రాబట్టిన జన నాయగన్.. హిందీలో బ్రేక్ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసి 2 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఓవరాల్‌గా అన్ని భాషల్లో కలిపి 5 రోజుల వరకు ఇండియాలో 135 కోట్ల రూపాయల నెట్.. 158 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ నివేదించింది. ఓవర్సీస్‌లో ఫస్ట్ వీకెండ్‌లో 7.45 మిలియన్ డాలర్లు (71.5 కోట్ల రూపాయలు) రాబట్టింది విజయ్. ఇందులో నార్త్ అమెరికా వాటా 1.31 మిలియన్ డాలర్లు (12.52 కోట్ల రూపాయలు) అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో జన నాయగన్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.More Articles