మెగా హీరో వరుణ్ తేజ్ కొణిదెల, యువ హీరోయిన్ రితికా నాయక్ జంటగా నటించిన చిత్రం కొరియన్ కనకరాజు. ఈ చిత్రంలో ఇంకా దక్షా నగార్కర్, కమెడియన్ సత్య, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
హారర్, కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్: థమన్ ఎస్, సినిమాటోగ్రఫి: మనోజ్ రెడ్డి, ఎఢిటర్: సత్య జీ, ఆర్ట్ డైరెక్టర్: ఏ పన్నీర్ సెల్వమ్, లిరిక్స్: శ్యామ్ కాసర్ల, కొరియోగ్రఫి: యశ్వంత్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం ఆగస్టు 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
రాయలసీమలోని పెనుగొండ బ్యాక్ డ్రాప్‌గా కొరియన్ కాన్సెప్ట్ను భారీగా ఈ సినిమా రూపొందింది. కొరియన్ యాక్లర్లతో కలిపి తొలిసారి తెలుగులో ప్రయోగం చేశారు. ఈ సినిమాను రిచ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ రూపొందించారనే విషయం ప్రమోషనల్ ప్రోమోలతో స్పష్టమైంది. ఈ సినిమా టీజర్, ఇతర ప్రోమోలు ఆసక్తిని రేపాయి. ఈ సినిమాను సుమారుగా 36 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా సుమారుగా 40 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కొరియన్ కనకరాజ్ సినిమా కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో ట్రేడ్‌కు కూడా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం కొన్ని సంస్థలు పోటీపడ్డాయి. చివరకు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ కంపెనీ హస్తగతం చేసుకొన్నది. ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, హిందీ డబ్బింగ్ రైట్స్ అంతా కలిపి సుమారుగా 24 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు కొన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ రావాలంటే.. ఇంకా 16 కోట్ల మేర రాబట్టాల్సి ఉంది. దాంతో ఈ సినిమా బడ్జెట్ పూర్తిగా రికవరీ అయ్యే అవకాశం ఉంది. థియేట్రికల్ విషయంలో యూవీ క్రియేషన్స్ ఆచీతూచీ వ్యవహరిస్తున్నది.More Articles