అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం రెండో వారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో తొలి ఆట నుంచే భారీ వసూళ్లను రాబడుతున్నది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి వారం అఖిల్ కెరీర్‌లో రికార్డు కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం గత 12 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది? ఈ చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్‌కు ఎంత దూరంలో ఉంది? అనే వివరాల్లోకి వెళితే...

Advertisement

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ, మన్మథుడు నాగార్జున అక్కినేని సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 55 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. అఖిల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా బిజినెస్ 22 కోట్ల మేర జరిగింది. ఈ చిత్రం 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే రిలీజైన అన్నీ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించింది. అఖిల్‌కు తొలి హిట్‌ను అందించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

నేషనల్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి వారం 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో 8వ రోజు 1.65 కోట్ల రూపాయలు, 9వ రోజు 2.4 కోట్ల రూపాయలు, 10వ రోజు 2.9 కోట్ల రూపాయలు, 11వ రోజు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 51.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 45 కోట్ల రూపాయల నెట్, కన్నడలో 5 కోట్ల రూపాయల నెట్, ఇతర ప్రాంతాల్లో 1.5 కోట్ల రూపాయల నెట్‌ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా ఫస్ట్ డే 13 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 12 కోట్ల గ్రాస్, మూడో రోజు 14 కోట్ల గ్రాస్, 4వ రోజు 5 కోట్ల గ్రాస్, ఆరో రోజు 3 కోట్ల గ్రాస్, ఏడో రోజు 2.5 కోట్ల గ్రాస్, ఎనిమిదో రోజు 3 కోట్ల గ్రాస్, 9వ రోజు 4 కోట్ల గ్రాస్, 11వ రోజు 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

నిర్మాతలు ప్రకటించిన ప్రకారం.. ఈ చిత్రం తొలి రో జు 16.7 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 14.7 కోట్ల గ్రాస్, మూడో రోజు 29.8 కోట్లు, నాలుగో రోజు 6.1 కోట్ల రూపాయలు, ఐదో రోజు 4.75 కోట్ల గ్రాస్, ఆరో రోజు 4 కోట్లు, 7వ రోజు 2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 6 రోజుల్లో 78 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. 10 రోజుల్లో 88 కోట్ల రూపాయలు, 11వ రోజుతో 89.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రం 12వ రోజున మరో 1.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 91 కోట్లు నమోదు చేస్తుంది. మరికొద్ది రోజుల్లో మరో 9 కోట్లు సాధిస్తే.. ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరుతుంది అని నిర్మాతల టీమ్ వెల్లడించింది.