టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం చేసిన బిజినెస్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా గత మూడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన రూరల్ డ్రామాను భారీ ఖర్చుతో నిర్మించారు. ఈ సినిమా సుమారుగా 55 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. ఈ మూవీ 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా 22 కోట్ల షేర్, 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువగా ఉండటంతో విడుదలైన ప్రతీ చోట బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకొనే పనిలో ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో లాభాల్లోకి ప్రవేశించింది. మరొకొన్ని జిల్లాలో ఈ వారం ముగిసే లోపు బ్రేక్ ఈవెన్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణలో భారీ వసూళ్లను రాబడుతున్నది. 3 రోజుల్లో ఈ చిత్రం నైజాంలో 7 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. ఆంధ్రాలో 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నార్త్ అమెరికాలో 5 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇతర దేశాల్లో కలిపి ఈ చిత్రం 61.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. లెనిన్ చిత్రం వరల్డ్ వైడ్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రో జు 16.7 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 14.7 కోట్ల గ్రాస్, మూడో రోజు 29.8 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3 రోజుల్లో 61.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక 4వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. గత మూడు రోజులుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రంపై సోమవారం ఎఫెక్ట్ ఉండేలా కనిపిస్తున్నది. ఈ చిత్రం 4వ రోజున 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఈవెనింగ్, నైట్ షోలకు రెస్పాన్స్ భారీగా ఉంటే.. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదే జోష్ కొనసాగితే త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తున్నది.More Articles