అక్కినేని నట వారసుడు అఖిల్‌కు తొలి హిట్ అందించిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ట్రేడ్ అంచనాలను మంచి ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తొలివారాంతం ముగిసే వరకు భారీగా వసూళ్లను రాబట్టింది. సోమవారం కూడా కఠిన పరీక్షను ఎదుర్కొని ఈ చిత్రం నిలకడగా వసూళ్లను సాధించింది. అయితే ఆరంభంలో వసూళ్లతో పోల్చుకొంటే భారీగా తగ్గినప్పటికీ.. ఈ సినిమా గౌరవప్రదమైన కలెక్షన్లు రాబడుతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమా 5 రోజుల్లో ఏ మేరకు వసూళ్లను సాధించింది? 6వ రోజు బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
అఖిల్ నటించిన ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాత నాగవంశీ భారీగా నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 55 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరగడంతో థియేట్రికల్ బిజినెస్ నామమాత్రం రేట్లకే క్లోజ్ చేశారు. అఖిల్ సక్సెస్ గ్రాఫ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా ఈ సినిమా బిజినెస్ 22 కోట్ల మేర జరిగింది. ఈ చిత్రం 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
లెనిన్ చిత్రం వరల్డ్ వైడ్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రో జు 16.7 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 14.7 కోట్ల గ్రాస్, మూడో రోజు 29.8 కోట్లు, నాలుగో రోజు 6.1 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 4 రోజుల్లో 67.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం 5వ రోజున తెలంగాణలో 1.50 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 1.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 40 లక్షల రూపాయలు, తమిళనాడులో 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి ఈ సినిమా 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 5 రోజుల్లో 71.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో గత 5 రోజుల్లో 32.3 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం బుధవారం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు భారీగానే క్షీణించినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా బుధవారం 25 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతున్నది. సాయంత్రం, నైట్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగితే మెరుగైనా వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం 6వ రోజున మరో 3 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో నిర్మాతలు తెలిపిన ప్రకారం.. ఈ చిత్రం 75 కోట్లకు అటు ఇటుగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. తొలి రోజు నుంచి ఈ సినిమా షాకింగ్‌గా బాక్సాఫీస్ నంబర్లను నమోదు చేస్తున్నది.More Articles