టాలీవుడ్ యంగ్ స్టార్స్ అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లెనిన్ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట బ్రేక్ ఈవెన్ సాధించి డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభాలను పంచి పెట్టడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో జోష్‌ను పెంచింది. ఈ మూవీ విడుదలై అఖిల్ కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేయడం అక్కినేని అభిమానుల్లో కూడా ఆనందాన్ని పంచింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ మూవీ గత 7 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం గ్రామంలో జరిగే జాతర నేపథ్యంగా సాగే రూరల్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. పక్కాగా గ్రామీణ వాతావరణంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 55 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ వాల్యూను 22 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
లెనిన్ చిత్రం 44 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల బ్రేక్ ఈవెన్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువగా ఉండటంతో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది అని నిర్మాత నాగవంశీ తెలిపారు. లెనిన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గత 6 రోజుల్లో భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం నైజాంలో 11 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 25 కోట్ల రూపాయల నెట్, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. లెనిన్ ఓవర్సీస్‌లో కూడా అంచనాలను మించి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాను శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం గత 6 రోజుల్లో 700K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 6.75 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని శ్లోకా సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టింది అని తెలిపింది. లెనిన్ చిత్రం వరల్డ్ వైడ్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రో జు 16.7 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 14.7 కోట్ల గ్రాస్, మూడో రోజు 29.8 కోట్లు, నాలుగో రోజు 6.1 కోట్ల రూపాయలు, ఐదో రోజు 4.75 కోట్ల గ్రాస్, ఆరో రోజు 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 6 రోజుల్లో 76 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఇక 7వ రోజు లెనిన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమేపీ తగ్గుకొంటూ వస్తున్నాయి. కానీ ఈ చిత్రం నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం గురువారం మొత్తంగా 2.5 నుంచి 3 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 80 కోట్ల కలెక్షన్లకు చేరువ కానున్నది. కానీ ఈ వారం హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీ సినిమా రిలీజ్ అవుతుండటంతో మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ మూవీపై భారీగానే దెబ్బ పడుతుందని అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.More Articles