అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం సక్సెస్‌పుల్‌గా రెండో వారంలోకి ప్రవేశించింది. తొలుత ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ చిత్రం తొలివారం అఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ వసూళ్లతో కలెక్షన్ల జర్నీని కొనసాగించింది. ఈ సినిమా తొలివారం ఏ మేరకు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Advertisement

లవ్, ఎమోషనల్‌, యాక్షన్, రూరల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మాతలు నాగవంశీ, నాగార్జున అక్కినేని నిర్మించారు. ఈ సినిమా అన్ని ఖర్చులతో కలిపి సుమారుగా 55 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాపై క్రేజ్ ఉండటంతో బిజినెస్ కూడా భారీగా చేసింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఈ సినిమా బడ్జెట్‌లో దాదాపు 30 శాతం రికవరీ సాధించింది. 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో ఈ చిత్రం భారీగా వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్ల రూపాయల నెట్, కర్ణాటకలో 4 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 42.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను ఇండియాలో వసూలు చేసింది.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. నార్త్ అమెరికాలోను, ఇతర దేశాల్లోను శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను విడుదల చేసింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 725K డాలర్లు, ఇతర దేశాల్లో కలిపి 990K డాలర్లు వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో 9.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తొలివారం 52 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

లెనిన్ చిత్రం వరల్డ్ వైడ్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రో జు 16.7 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 14.7 కోట్ల గ్రాస్, మూడో రోజు 29.8 కోట్లు, నాలుగో రోజు 6.1 కోట్ల రూపాయలు, ఐదో రోజు 4.75 కోట్ల గ్రాస్, ఆరో రోజు 4 కోట్లు, 7వ రోజు 2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 6 రోజుల్లో 78 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

ఇక 8వ రోజు లెనిన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. లేటేస్ట్ సినిమా రిలీజ్ కారణంగా ఈ చిత్రం వసూళ్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ చిత్రం సుమారుగా రెండో శుక్రవారం 1.5 నుంచి 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నిర్మాతల లెక్క ప్రకారం.. ఈ సినిమా 80 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోను బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లో కొనసాగుతున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు 5 కోట్లకుపైగా లాభాలతో కొనసాగుతుందని తెలిపారు.