టాలీవుడ్ యంగ్ స్టార్స్ అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లెనిన్ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట బ్రేక్ ఈవెన్ సాధించి డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభాలను పంచి పెట్టడమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో జోష్‌ను పెంచింది. ఈ మూవీ విడుదలై అఖిల్ కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేయడం అక్కినేని అభిమానుల్లో కూడా ఆనందాన్ని పంచింది. అయితే రెండో వారంలో ఈ సినిమా కలెక్షన్లు భారీగా క్షీణించాయి.
అయితే సక్సెస్ బాటలో కొనసాగుతున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పిస్తున్నది. ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే. సినిమాటోగ్రఫి: లియోన్ బ్రిట్టో, మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలీ, యాక్షన్ కోరియోగ్రఫి: దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రఫి: దినేష్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జూలై 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం చేసిన బిజినెస్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా గత మూడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం గ్రామంలో జరిగే జాతర నేపథ్యంగా సాగే రూరల్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. పక్కాగా గ్రామీణ వాతావరణంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 55 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ వాల్యూను 22 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ తొలి వారంలో భారీగా వసూళ్లను నమోదు చేసింది. గత ఏడు రోజుల్లో 37 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ మూవీ 8వ రోజు 1.65 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. ఇక తొమ్మిది రోజు ఈ సినిమా 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో సుమారుగా 40 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. లెనిన్ చిత్రం వరల్డ్ వైడ్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రో జు 16.7 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 14.7 కోట్ల గ్రాస్, మూడో రోజు 29.8 కోట్లు, నాలుగో రోజు 6.1 కోట్ల రూపాయలు, ఐదో రోజు 4.75 కోట్ల గ్రాస్, ఆరో రోజు 4 కోట్లు, 7వ రోజు 2.5 కోట్లు, 8వ రోజు 1.65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 8 రోజుల్లో 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.More Articles