ఏజెంట్ డిజాస్టర్ తర్వాత మూడేళ్ల గ్యాప్ అనంతరం ప్రేక్షకుల ముందుకొచ్చారు కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్. ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ హిట్ కొట్టాలన్న కసితో ఆయన చేసిన సినిమాయే లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, గ్రామీణ వాతావరణంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జూలై 4న లెనిన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో లెనిన్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు లెనిన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
లెనిన్ తారాగణం
లెనిన్‌లో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. రామ్‌కి, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. థమన్ సంగీతం అందించారు.
లెనిన్ బడ్జెట్ అండ్ బ్రేక్ఈవెన్ టార్గెట్ లెనిన్ అడ్వాన్స్ బుకింగ్ లెనిన్ ఓవర్సీస్ కలెక్షన్స్ తొలి రోజు లెనిన్ వసూళ్ల అంచనా ఫస్ట్ డే లెనిన్ తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున 7 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి లెనిన్ సినిమాను దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినట్లుగా టాలీవుడ్ టాక్. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా లెనిన్ మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5, శాటిలైట్ రైట్స్‌ని జీ తెలుగు సొంతం చేసుకున్నాయి. లెనిన్ సినిమాను నిర్మాత నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లెనిన్ బ్రేక్ఈవెన్ కావాలంటే 25 కోట్ల రూపాయల షేర్.. 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఇండియాలోని ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ రైట్స్ కలిపి లెనిన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లెనిన్ ఎదుట భారీ టార్గెట్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.
అఖిల్ కమ్ బ్యాక్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్‌లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియా వైడ్‌గా 2250 షోలకు గాను... 1.75 లక్షల టికెట్లు అమ్ముడైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రీ సేల్స్ పరంగా తెలంగాణలో 1.18 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.16 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 25 లక్షల రూపాయలు, తమిళనాడులో 1.50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 60 వేల రూపాయలు చొప్పున అడ్వాన్స్ బుకింగ్‌లో ఇండియా వైడ్‌గా 2.61 కోట్ల రూపాయలు రాబట్టింది లెనిన్.
ఇక ఓవర్సీస్‌లో లెనిన్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. అమెరికాలో 193 సెంటర్స్‌లో 358 షోలను ఏర్పాటు చేయగా 5491 టికెట్స్ సేల్ అయ్యాయి. దాంతో 80,081 డాలర్లు (76.32 లక్షల రూపాయలు) వసూలు చేసింది. అయితే తొలిరోజున నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌లో 110K డాలర్లు (1.04 కోట్ల రూపాయలు) రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాతో అడ్వాన్స్ బుకింగ్‌లోనే లెనిన్ మూవీ వరల్డ్ వైడ్‌గా 3.65 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
చిత్ర యూనిట్ చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు, అక్కినేని బ్రాండ్‌తో లెనిన్‌పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ కారణంగా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. శుక్రవారం నుంచి వీకెండ్ మొదలు కానుండటంతో సాయంత్రం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తే అవకాశం ఉంది. తొలిరోజు ఇండియా వైడ్‌గా సాయంత్రం 4 గంటల వరకు లెనిన్ మూవీకి 1059 షోలు ప్రదర్శితమవ్వగా.. 42 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. తొలిరోజు అఖిల్ అక్కినేని మూవీ ఇండియా వైడ్‌గా 2.14 కోట్ల రూపాయల నెట్ రాబట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.More Articles